Prakasam

కోలా ఇంటికి మాగుంట రాఘవరెడ్డి

టీడీపీలోకి సాదర ఆహ్వానం

19న కోలాకు తెలుగుదేశం తీర్ధం

వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ప్రభాకర్ ను ఒంగోలు లోక్ సభ తెలుగుదేశం అభ్యర్ధి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం రాఘవరెడ్డి స్వయంగా కోలా ఇంటికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డిని కోలా సాదరంగా ఆహ్వానించారు. పుష్పగుచ్ఛం అందించి దుశ్శాలువతో సత్కరించారు. తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోలా సన్నిహితులు, స్నేహితులు భారీగా తరలివచ్చారు. కోలా రాకతో పార్టీ మరింత బలోపేతమవుతుందని రాఘవరెడ్డి అన్నారు. తన ఇంటికి వచ్చిన రాఘవరెడ్డికి కోలా కృతజ్ఞతలు తెలిపారు. కోలా ఇంటికి వచ్చి రాఘవరెడ్డిని కలిసిన వారిలో జడా బాల నాగేంద్రం, ఆరిగ చలమయ్య తదితరులు ఉన్నారు.

కోలా ప్రభాకర్ తో చర్చిస్తున్న మాగుంట రాఘవరెడ్డి.. పక్కన జడా బాల నాగేంద్రం

ఈనెల 19న పార్టీలోకి..

ఈనెల 19న ఉదయం 10 గంటలకు ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో నిర్వహించే సభలో కోలా ప్రభాకర్ అధికారికంగా టీడీపీలో చేరనున్నారు. ఒంగోలు టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధి దామచర్ల జనార్దన్, లోక్ సభ స్థానం అభ్యర్ధి మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు టీడీపీకి చెందిన ఇతర నాయకులు సభకు రానున్నారు.

కోలా ఇంటికి వచ్చి మాగుట రాఘవరెడ్డిని కలిసిన కాపు ఉద్యమ నాయకుడు, ఒంగోలు అర్బన్ బ్యాక్ మాజీ అధ్యక్షుడు ఆరిగ చలమయ్య

 

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *