Prakasam

పోలీసుల వేధింపులతోనే రాజశేఖర్ ఆత్మహత్య

  • ఒంగోలు టూ టౌన్ పోలీసులు కొట్టి అవమానించారు
  • అధికార పార్టీ నేతల మెప్పుకోసం మృతుడిపై థర్డ్ డిగ్రీ
  • రాజశేఖర్ కుటుంబానికి 25 లక్షలు ఎక్ష్ గ్రేషియా ఇవ్వాలి
  • వీఆర్ కాదు.. పోలీసుల్ని సస్పెండ్ చేయాలి
  • జిల్లా కలెక్టర్ మెజిస్టీరియల్ విచారణ చేపట్టాలి
  • దళిత నేత నీలం నాగేంద్ర డిమాండ్
రాజశేఖర్ భౌతిక కాయాన్ని పరిశీలిస్తున్న దళిత నేత నీలం నాగేంద్రం, తదితరులు

ఒంగోలు టూ టౌన్ పోలీసులు కొట్టి అవమానించడంతో పురుగుమందు తాగి మరణించిన పరుచూరి రాజశేఖర్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. ఆదివారం రిమ్స్ పోస్ట్మార్టం రూమ్లో పరుచూరి రాజశేఖర్ మృతదేహాన్ని నాగేంద్ర పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం పోలీసులు చూపిన అత్యుత్సాహమే రాజశేఖర్ బలవన్మరణానికి కారణమైందన్నారు. రెండు సంవత్సరాల క్రితం కొత్తపట్నం పోలీస్ స్టేషన్లో వింటాస్ హేచరీస్ ఏండి ఎస్వి సుధాకర్ కు – మేనేజర్ పరుచూరి రాజశేఖర్ కు మధ్య ఆర్థిక లావాదేవీల వివాదంపై పరిష్కారం జరిగిందన్నారు. అధికారం మారడంతో అధికార పార్టీ ముఖ్య నేత సూచన మేరకు పరుచూరి రాజశేఖర్ ను ఒంగోలు టూ టౌన్ పోలీసులు సెప్టెంబర్ 30న స్టేషన్కు పిలిపించారన్నారు. వింటాస్ హేచరీస్లో జరిగిన ఆర్థిక అవతావకలపై నేరం అంగీకరించాలని రాజశేఖర్ ను అవమానకరంగా కొట్టారన్నారు. బలవంతంగా కాగితాలపై సంతకం చేయించుకున్నారన్నారు. అవమానభారంతో పురుగు మందు తాగిన రాజశేఖర్ జరిగిన ఘటనపై సూసైడ్ నోట్ కూడా రాశారని, ఆ నోట్ లో తనను కొట్టిన పోలీసుల పేర్లు, ఏం జరిగిందనే వివరాలను పేర్కొన్నాడన్నారు.

కొందరు పోలీసులు పోలీస్ మాన్యువల్ను, నేర విచారణ ప్రక్రియను పక్కనపెట్టి అధికార పార్టీ నేతల ఆజ్ఞల్నే తమ ఆఫీస్ మాన్యువల్ గా మార్చుకున్నారన్నారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో దళితుడైన దామరకుంట కుమార్ ఆత్మహత్యాయత్నం ఘటనతో పాటు ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పరుచూరి రాజశేఖర్ బలవన్మరణానికి పోలీసులపై అధికార పార్టీ నేతల ప్రభావమే కారణమన్నారు.

ఒంగోలు తాలూకా పోలీసుల అదృష్టం బాగుండి, ఆత్మహత్యకు పాల్పడ్డ దళితుడు దామరగుంట కుమార్ బతికాడన్నారు. ఒంగోలు టూ టౌన్ పోలీసుల ఖాకీ క్రౌర్యానికి కమ్మ కులానికి చెందిన పరుచూరి రాజశేఖర్ మరణించాడన్నారు. రాజశేఖర్ ను స్టేషన్లో కొట్టి అవమానించిన పోలీసుల్ని విఆర్ఓ పంపితే సరిపోదని, వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని నాగేంద్ర డిమాండ్ చేశారు. పరుచూరి రాజశేఖర్ బలవన్మరణాన్ని కస్టోడియల్ డెత్ గా పరిగణించి జిల్లా కలెక్టర్ ఒంగోలు ఆర్డీఓ ద్వారా మెజిస్టీరియల్ ఎంక్వైరీ జరిపించాలని నాగేంద్ర డిమాండ్ చేశారు. నాగేంద్ర వెంట బహుజన గిరిజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గంటా సుబ్బారావు తదితరులు ఉన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *