ప్రణవి..గురి పెడితే గోల్డ్ మెడల్
- రైఫిల్ పోటీల్లో కొనసాగుతున్న విజయపరంపర
- జాతీయ స్థాయిలో టాప్ 10 లో ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ
కర్ణాటక స్టేట్ ఛాలెంజర్స్ కప్-2023 లతో ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ ద్వారం ప్రణవి విజయకేతనం ఎగురవేసింది. కర్ణాటక స్టేట్ రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 31 నుండి ఏప్రిల్ 7 వరకు బెంగుళూరులో నిర్వహించిన రైఫిల్ పోటీల్లో 250 స్కోరుకు గాను 247 స్కోరు రాబట్టి గోల్డ్ మెడల్ సాధించి విజయ పరంపరను కొనసాగించింది. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం రంగాయపాలెం గ్రామానికి చెందిన ద్వారం ప్రణవి హైదరాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూ ల్ లో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది. తండ్రి జాలిరెడ్డి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. లోగడ ప్రణవి చెన్నై లో నిర్వహించిన రైఫిల్ టోర్నమెంట్ లో సిల్వర్ మెడల్ సాధించింది. హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లోనూ గోల్డ్ మెడల్ సాధించింది. రైఫిల్ క్రీడాకారుల్లో నేషనల్ టాప్ 10లో ఉన్న ప్రణవి భవిష్యత్ నూ మరిన్ని విజయాలు సాధించి దేశానికి వన్నె తీసుకు రావాలని ఆకాంక్షిద్దాం.

