ప్రకాశం రైఫిల్ ద్వారం ప్రణవి
- జాతీయ స్థాయి ఎయిర్ గన్ షూటింగ్ పోటీల్లో
- బంగారు, రజత పతకాలు కైసవం
ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ ఎయిర్ గన్ షూటింగ్ పోటీల్లో రైఫిల్ లా దూసుకుపోతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని భోపాల్ లో నిర్వహించిన జాతీయ స్థాయి ఎయిర్ గన్ షూటింగ్ పోటీల్లోని వివిధ విభాగాల్లో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం రంగాయపాలెంకు చెందిన ద్వారం ప్రణవి గోల్డ్ మెడల్ తో పాటు మరో మూడు రజిత పతకాలను సాధించారు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ద్వారం జాలిరెడ్డి, ప్రగతి ల రెండవ కుమార్తె అయి ద్వారం ప్రణవి గతంలో వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన అనేక ఎయిర్ గన్ షూటింగ్ పోటీల్లో పొల్గొని బహుమతులందుకున్నారు. ఇపుడు ప్రణవి జాతీయ స్థాయి పోటీల్లో రాణించటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.