సీఎం చంద్రబాబుతో కోలా ప్రభాకర్

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కాపు నాయకుడు కోలా ప్రభాకర్ కొద్దిసేపు మాట్లాడారు. ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు హెలిప్యాడ్ వద్ద కోలాను ఎంపీ మాగుంట పరిచయం చేశారు. తాను కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శినని కోలా పరిచయం చేసుకున్నారు. కోలా భుజంపై పచ్చ కండువా వేసిన చంద్రబాబు బాగా పనిచేయమని ప్రోత్సహించినట్టు సమాచారం.

