కంది రవిశంకర్ తో శ్రీశిల్ప దంపతుల భేటీ

- అభినందనలు తెలిపిన రవిశంకర్
- గెలిపించి తీరుతామని భరోసా
ప్రముఖ వ్యాపారవేత్త, జనసేన నాయకుడు కంది రవిశంకర్ ను టీడీపీ తరపున ఒంగోలు మేయర్ స్థానానికి పోటీ చేస్తున్న నల్లమల్లి శ్రీశిల్ప మర్యాదపూర్తకంగా కలిశారు. ఆయనను కలిసిన వారిలో ఆమె భర్త నల్లమల్లి బాలు, మాజీ మున్సిపల్ చైర్మన్ యక్కల తులసీరామ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వేమూరి బుజ్జి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీవల్లికి రవిశంకర్ అభినందనలు తెలిపారు. కలిసికట్టుగా ఎన్నికల్లో పనిచేసి కూటమి అభ్యర్ధి అయిన శ్రీశిల్పను గెలిపించి తీరుతామని ఈ సందర్భంగా రవిశంకర్ వ్యాఖ్యానించారు.

