పవన్ తో వంగవీటి రాధ భేటీ

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన క్యాంప్ కార్యాలయంలో పవన్ తో ఆయన సమావేశమయ్యారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని జనసేన వర్గాలు చెబుతున్నా ఇద్దరి సమావేశం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వారిద్దరు చర్చించినట్టు సమాచారం.

