శ్రీశైలంలో సర్వదర్శనభాగ్యం

శ్రీశైలంలో సామాన్య భక్తుడికి మల్లికార్జునస్వామి స్పర్శదర్శన భాగ్యం కల్పించాలని దేవస్థానం పాలకవర్గం నిర్ణయించింది. ఈ మేరకు సర్వ దర్శనం కోసం ప్రతిరోజు రాత్రి 9 నుండి 10 గంటల వరకు సామాన్య భక్తులకు అనుమతివ్వనున్నారు. ఈ మేరకు రాత్రి 7:30 నుండి ఆర్జితసేవ కౌంటర్స్ లో భక్తులకు 500 విరామ దర్శనం టికెట్ అందుబాటులో ఉంచనున్నట్టు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి లవన్న తెలిపారు. ఇప్పటి వరకు విరామ దర్శనానికి లెటర్ ప్యాడ్ పై టికెట్స్ ఇచ్చామనీ..ఇకపై సామాన్యుభక్తుడికి అందుబాటులో స్పర్శదర్శనం టికెట్లు ఉంచనున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.