రవిశంకర్ కు టైమ్స్ బిజినెస్ అవార్డు

ఒంగోలుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ ప్రతిష్టాత్మకమైన టైమ్స్ బిజినెస్ అవార్డు దక్కించుకున్నారు. విలువలు, నిబద్ధతతో కూడిన వ్యాపారవేత్తగా ఆయనకు మంచి పేరుంది. ఒంగోలకు సమీపంలోని చదలవాడలో విల్లాలు నిర్మిస్తున్న రవి శంకర్ గ్రూప్ నిర్మాణరంగంలో మంచి గుర్తింపు సాధిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన టైమ్స్ గ్రూప్ నుంచి బిజినెస్ అవార్డు అందుకున్నారు.

కంది రవిశంకర్ ను అభినందిస్తున్న మారెళ్ల సుబ్బారావు, కొల్లా మధు, నూకతోటి శరత్ తదితరులు

కంది రవిశంకర్ కు అభినందనలు

ది టైమ్స్ ఇండియా 2022 సంవత్సరానికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్ ను వరించడం పట్ల పలువురు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అవార్డు అందుకున్న కంది రవిశంకర్ ను ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు, నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు, చైతన్య స్వర భారతి అధ్యక్షులు నూక తోటి శరత్ బాబు బొకే ఇచ్చి శాలువతో ఘనంగా సత్కరించారు. టీవీఎస్ రవిగా పేరు సంపాదించుకున్న కంది రవిశంకర్ ఒంగోలు నగరంలో కార్పొరేట్ సంస్కృతికి నాంది పలికారు.. ప్రజలందరికీ ఆహ్లాదాన్ని పంచే రవి ప్రియ మాల్ నిర్మించి ఒంగోలు నగరానికి తలమానికంగా తీర్చిదిద్దారని అన్నారు. ఈ సమావేశంలో విశ్రాంతి ఏ ఎస్ పి సుంకర సాయి బాబా, వీర ప్రతాప్ తదితరులు పాల్గొని అభినందించారు.

SHARE THIS NEWS

Leave a Reply

Your email address will not be published.