ap news

క్రిస్టినా ఎస్సీ కాదా..!

  • గుంటూరు జడ్ చైర్మన్ హెన్రీ క్రిస్టినా కాదంటూ 
  • హైకోర్టులో దాఖలైన పిటిషన్ 

● గుంటూరు జడ్పీ ఛైర్మన్ హెన్రీ క్రిస్టినా ఎస్సీ కాదంటూ తెనాలికి చెందిన సరళకుమారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్రిస్టినా తప్పుడు ధృవపత్రం సమర్పించారని పిటిషనర్ ఆరోపించారు. ఈ మేరకు గతంలో జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేసినట్టు పిటిషనర్ తెలిపారు. దీనిపై ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను మూడు వారాలకు ధర్మాసనం వాయిదా వేసింది. హెన్రీ క్రిస్టినా నూతనంగా గుంటూరు జడ్ పి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. వైసీపీ తరపున ఆమె జడ్ పిటిసిగా గెలుపొందారు. గుంటూరు జడ్ పి చైర్ పర్సన్ పదవి ఎస్.సికి రిజర్వుడు కావటంతో క్రిస్టినాను పార్టీ ఎంపిక చేసింది.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *