ap news

సీఎంతో నీతి ఆయోగ్‌ బృందం భేటీ

క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌తో నీతి ఆయోగ్‌ బృందం భేటీ:
నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌. స్పెషల్‌ సెక్రటరీ కె.రాజేశ్వరరావు ఇంకా బృందం సభ్యులతో పాటు, సీఎస్‌ డాక్టర్‌ రాజీవ్‌శర్మ, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న నవరత్నాలను నీతి ఆయోగ్‌కు వివరించిన అధికారులు

– సుపరిపాలన కోసం తీసుకొచ్చిన మార్పులను వివరించిన అధికారులు

– నవరత్నాలు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల వెల్లడి.

– నవరత్నాలలోని వ్యవసాయం, వైద్య ఆరోగ్య రంగం, విద్యా రంగంలో సంస్కరణలు, మహిళా సాధికారత, గ్రామ, వార్డు సచివాలయాలు తదితర అంశాలను వివరించిన అధికారులు.

– రైతు భరోసా కేంద్రాలు, వీటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, అగ్రి టెస్టింగ్‌ ల్యాబులు, రైతు భరోసా, ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ పంట రుణాలు, పంటల బీమా, ధరల స్థిరీకరణ, ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో పరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) చెల్లింపు, అమూల్‌తో ఒప్పందం, ఆ సంస్థతో కలిసి చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను తెలిపిన అధికారులు.

– అదే విధంగా రూ.3,176.61 కోట్లతో నిర్మించనున్న 8 ఫిషింగ్‌ హార్బర్లు, 4 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, ఆక్వా హబ్స్, ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్స్, మత్స్యకారులకు డీజిలుపై సబ్సిడీ, చేపల వేట నిషేధ కాలంలో ఆర్థిక సహాయం తదితర కార్యక్రమాలను వివరించిన అధికారులు.

  •  రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆర్గానిక్‌ పంటల ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని, దీని వల్ల రైతులకు మంచి ఆదాయాలు వస్తాయని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ పేర్కొనగా, ఇప్పటికే దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న అధికారులు.

వైద్య ఆరోగ్య రంగం..

  • వైద్యం,ఆరోగ్యం రంగంలో తీసుకున్న పలుచర్యలను నీతి ఆయోగ్‌కు వివరించిన అధికారులు.
  • విలేజ్‌ అర్బన్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, కొత్తగా మెడికల్‌ కాలేజీలు. సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు, నాడు–నేడు ద్వారా ఆస్పత్రుల్లో మార్పులు, తగిన సంఖ్యలో వైద్య సిబ్బంది, తల్లులు, పిల్లల ఆరోగ్యంపై దృష్టి, సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కింద అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించిన అధికారులు.
  • మహిళలు, చిన్నారుల్లో రక్తహీనతను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ.
  • రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరును అడిగి తెలుసుకున్న నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌.

విద్యా రంగం

  • విద్యా రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను వివరించిన అధికారులు.అమ్మఒడి పథకంపై పూర్తి వివరాలు ఆరా తీసిన నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌
  • అంగన్‌వాడీలతో పాటు, స్కూళ్లను ఆరు రకాల కేటగిరీలుగా విభజించిన ప్రభుత్వం. వాటి వివరాలను కూడా నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌కు స్వయంగా వివరించిన సీఎం
  • సబ్జెక్టుల వారీగా బోధన, పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచేందుకు తీసుకున్న చర్యలను వివరించిన సీఎం
  • ఆ చర్యలను ప్రశంసించిన నీతి ఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌

మహిళా సాధికారత:

– మహిళా సాధికారిత కోసం తీసుకున్న చర్యలను వివరించిన అధికారులు.
– చేయూత, ఆసరా, పెన్షన్లు తదితర కార్యక్రమాలను నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌కు వివరించిన అధికారులు.
– ఆసరా, చేయూత ఉద్దేశాలను, సుస్థిర ఆర్థిక ప్రగతికోసం అమలు చేస్తున్న ఉపాధి కార్యక్రమాలను నీతి ఆయోగ్‌వైస్‌ ఛైర్మన్‌కు వివరించిన సీఎం.

ఇంకా..:

– పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని వివరించిన అధికారులు.
– గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సుపరిపాలన కోసం తీసుకున్న చర్యలను వివరించిన అధికారులు.
– ‘దిశ’ కింద మహిళల భద్రత కోసం తీసుకున్న చర్యలను వివరించిన అధికారులు.
– దిశ యాప్‌పై నీతి ఆయోగ్‌ ప్రశంసలు. ఏపీ ప్రభుత్వ అధికారుల నుంచి వివరాలు తీసుకోవాలన్న నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌.

విద్యుత్‌ రంగం–ఆర్థిక స్థితిగతులు:

– రాష్ట్ర విద్యుత్‌ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను నీతి ఆయోగ్‌ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు.
– తీవ్ర రుణభారంతో ఉన్న విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ సంస్థలను గాడిలో పెట్టడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరిన సీఎం.
– రాష్ట్ర విభజన అనంతర పర్యవసనాల కారణంగా ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను నీతి ఆయోగ్‌ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు.
– హైదరాబాద్‌ను కోల్పోవడంతో పెద్ద ఎత్తున ఆదాయానికి గండి పడిందని గణాంకాలతో సహా వివరించిన అధికారులు.
– ప్రఖ్యాత ప్రభుత్వ రంగ సంస్థలను కోల్పోయామని, సహజ వనరుల విషయంలోనూ ఇబ్బంది వచ్చిందని, ప్రత్యేక హోదా లాంటి హామీలు నెరవేరలేదని తెలిపిన అధికారులు.
– తెలంగాణతో పోలిస్తే.. ప్రస్తుతం ఏపీ తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందంటూ ఆ వివరాలను గణాంకాలతో చూపిన అధికారులు.

హోదా–ఆర్థిక సహాయం:

– ప్రత్యేక హోదా ఇప్పించేలా తగిన సహకారం అందించాలని, పారిశ్రామిక రాయితీలు, పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరిన అ«ధికారులు.
– కోరాపుట్, బాలంగీర్, బుందేల్‌ఖండ్‌ తరహాలోనే వెనకబడ్డ జిల్లాలను ఆదుకోవాలని కోరిన అధికారులు.

కడప స్టీల్‌ ప్లాంట్‌–పోర్టులు–ప్రాజెక్టులు:

– విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ప్రకారం కడప స్టీల్‌ప్లాంట్‌ సహా ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు తగిన సహాయం అందించాలని కోరిన అధికారులు.
– కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం అనంతపురంలో నాలుగు ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని, జీఎస్టీ రీయింబర్స్‌ సహా మరికొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరిన అధికారులు.
– రాష్ట్రంలో నిర్మించనున్న పోర్టులకు ఆర్థిక సహాయం అందించాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలా అంచనాల ఆమోదానికి తగిన విధంగా తోడ్పడాలని నీతి ఆయోగ్‌ను కోరిన అధికారులు.
– రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు తగిన విధంగా నిధులు అందించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం.
– అప్పర్‌ సీలేరులో కొత్తగా నిర్మించ తలపెట్టిన 1350 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టుకు సహాయం అందించాలని కోరిన అధికారులు.

బకాయిల ప్రస్తావన

– తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6,284 కోట్ల విద్యుత్‌ బకాయిలు ఇప్పించాలని కోరిన అధికారులు.
– రీసోర్స్‌ గ్యాప్‌ కింద కాగ్‌ నిర్ధారించిన విధంగా ఇంకా రావాల్సిన రూ.18,969 కోట్ల నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరిన అధికారులు.

– జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతుబద్ధత లేని అంశాలను వివరించిన అధికారులు.
– దీని వల్ల రాష్ట్రానికి చాలా నష్టం కలుగుతోందని అధికారుల వెల్లడి.

నీటి ఆయోగ్ వైైస్ చైర్మన్ కు జ్ఞాపిక అందచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఏపీలో కార్యక్రమాలు ప్రత్యేకం… రాజీవ్‌కుమార్‌. నీతిఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌

– రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రంతో పరస్పర సహకారంతో సమాఖ్య స్ఫూర్తి కొనసాగేలా మా వంతుగా కృషి చేస్తాము.
– రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు అభినందనీయం, ఆదర్శప్రాయం. దేశంలో తొలిసారిగా వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.
– రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ విషయంలో నాకెంతో నమ్మకం ఉంది.
– గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీలు. వ్యవసాయానికి అండ, రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ, వికేంద్రీకరణ ప్రక్రియలు బాగున్నాయి.
– ఇంకా మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ యాప్‌. ఇది నిజంగా ఎంతో అభినందనీయం. మహిళలకు ఎల్లవేళలా ఎంతో తోడుగా నిలుస్తోంది. దీన్ని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచిస్తున్నాం.
– ఇంకా కోవిడ్‌ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షల డిపాజిట్‌. దీన్ని కూడా ఇతర రాష్ట్రాలు అమలు చేయాలని కోరుతాం.
– ప్రజా సంక్షేమం కోసం పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో వాటిని అందజేస్తున్నారు. ఇది అభినందనీయం.
– రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే చేపట్టారు. దీని వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంది. ఎన్నో భూవివాదాలు పరిష్కారమవుతాయి.
– ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో కూడా మీరు ముందున్నారు. ఇది కూడా ప్రశంసనీయం.
– కోస్టల్‌ ఎకనామిక్‌ జోన్స్, ఎగుమతులు తదితర రంగాల్లో ఏపీ వృద్ధికి సహాయపడతాం.
– ఈ రంగంలో మౌలిక సదుపాయాలు కల్పన తదితర అంశాల్లో రాష్ట్రానికి చేయూత నిస్తాం.
– విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ హైదరాబాద్‌ నగరాన్ని కోల్పోవడంతో.. ఆదాయం తగ్గిందన్న విషయం మాకు తెలుసు.
– సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాగా చేస్తోంది.
– రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ విషయంలో మా వంతు సహకారాన్ని అందిస్తాం.
– వ్యవసాయ రంగంలో రాష్ట్రం బాగా రాణిస్తోంది. ముఖ్యంగా నేచురల్‌ ఫార్మింగ్, ఉద్యాన పంటల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిల్చింది.
– రెవెన్యూ లోటును పూడ్చడం, పోలవరం ప్రాజెక్టు పూర్తి, వీటన్నింటి కోసం ప్రయత్నిస్తాం.
– పోలవరం ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి మరోసారి సమగ్ర అధ్యయనం చేస్తే బాగుంటుంది. తద్వారా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో మార్పులు వస్తాయి.
– మీకు విశాల తీర ప్రాంతం ఉంది. వాటిలో ఎకనామిక్‌ జోన్లు, పారిశ్రామిక జోన్ల ఏర్పాటు ముఖ్యం.
– పర్యాటక రంగం వల్ల కూడా ఆదాయం వస్తుంది.
– రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుస్తుంది. ఆ పొటెన్షియల్‌ ఇక్కడ ఉంది. ఈ విషయంలో నాకు ఎంతో నమ్మకం ఉంది.
– ఆ దిశలో మా వంతుగా పూర్తి సహాయ, సహకారాలు కూడా అందిస్తాం.
– అంగన్‌వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం ఇస్తున్నారు. ఇది కూడా ప్రశంసనీయం. దీని వల్ల పిల్లల్లో పౌష్టికాహార లోపం ఉండదు.
– రాష్ట్రం చేసే ప్రతి పనిలో నీతి ఆయోగ్‌ మీకు అండగా నిలుస్తుందని తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాలలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.. అని నీతిఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ ప్రసంగం ముగించారు.

ఇక చివరగా మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, రాష్ట్ర పురోగతికి కేంద్రంతో పాటు, నీతిఆయోగ్‌ అన్ని విధాలుగా అండగా నిలవాలని, పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *