ap news

పొగాకు బోర్డు సభ్యునిగా జీవీఎల్

జీవీఎల్ నరసింహారావు : రాజ్యసభ సభ్యుడు

పొగాకు బోర్డు సభ్యునిగా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పొగాకు బోర్డు చట్టం 1975 సెక్షన్ 4(4)(బి), 1976 రూల్ 4(1) ప్రకారం రాజ్యసభ సభ్యుడిని బోర్డు పాలకవర్గ సభ్యునిగా నియమించాల్సి ఉంది. లోక్ సభ నుంచి బండి సంజయ్ (తెలంగాణ), బాలశౌరి (ఏపీ)లు ఇప్పటికే పొగాకు బోర్డు సభ్యులుగా కొనసాగుతుండగా ఇకపై రాజ్యసభ నుంచి జీవీఎల్ సభ్యునిగా కొనసాగనున్నారు. పొగాకు రైతు లోక్‌సభ నుండి పొగాకు బోర్డు పార్లమెంట్ ప్రతినిధులుగా పనిచేస్తున్నారు. జీవీఎల్ ప్రస్తుతం మిర్చి బోర్డు టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. గతంలో సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా కూడా పనిచేశారు. రాజ్యసభ నుంచి తనకు సభ్యత్వం కల్పించినందుకు సంతోషం వ్యక్తం చేసిన జీవీఎల్ పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేస్తానని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *