అసని..హై అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అసాని తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కోనసీమ కలెక్టరేట్లో సెంట్రల్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసిన శుక్లా స్వయంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, ముందస్తు చర్యలు పర్యవేక్షించారు. కంట్రోల్ రూమ్ లో 24 గంటలు సిబ్బందికి అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశామని, ఉద్యోగుల సెలవులు ఇప్పటికే రద్దు చేశామని తెలిపారు. తుఫాను ప్రభావం తగ్గే వరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయన్నారు. అదేవిధంగా జిల్లాలో అన్ని మండల తాసిల్దార్ కార్యాలయాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

దిశ మార్చుకున్న ‘అసని’.. రాష్ట్రంలో అతిభారీ వర్షాలకు ఛాన్స్!

బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా కొనసాగుతున్న తుపాను ‘అసని’ దిశ మార్చుకుందని.. రేపు సాయంత్రం లోగా మచిలీపట్నం – కోనసీమ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హిమాన్షు శుక్లా

తుపాను దృష్ట్యా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. విపత్తు నిర్వహణ సంస్థ అభికారులతో మాట్లాడిన కలెక్టర్ ప్రస్తుత పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాను దృష్ట్యా అన్ని మండలాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. తీర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మత్స్య కారులకు జాగ్రత్తలు చెబుతున్న కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

Leave a Reply

Your email address will not be published.