ap news

తీవ్ర ఫ్రస్టేషన్‌లో పవన్‌ కళ్యాణ్‌

  • మంత్రులను సన్నాసులంటావా..
  • ఇదేనా పవర్ స్టార్ భాష..ఇదేనా సంస్కారం 
  • రెచ్చిపోయిన వ్యవసాయమంత్రి కన్నబాబు 

రెండు చోట్ల ఓటమితో ఇంకా కోలుకున్నట్లు లేదు
జగన్‌గారిపై ఈర్శ్య, అసూయ, ద్వేషం. అందుకే విమర్శలు
వేదిక ఏదైనా అదే ధోరణి. మంత్రులు సన్నాసులా
ఇదేనా పవన్‌కళ్యాణ్‌ సంస్కారం. అదేనా నీ భాష
పార్టీ వ్యవస్థాపకుడైనా కులాలు ఆపాదిస్తూ పబ్లిక్‌లో మాట్లాడారా..!
జగన్‌గారు ఒక్కటే చెప్పారు. కులం, మతం, రాజకీయం చూడం అన్నారు
ఆయన సిద్దాంతాలను మీరు ఒప్పుకోలేక అలా మాట్లాడారు
తొలిసారిగా నిర్మాతలు, దర్శకులకు కూడా కులాన్ని ఆపాదించారు
ఒకవేళ అదే ప్రాతిపదిక అయితే, ఏ కులం వారు..
ఆ కులం వారితోనే సినిమాలు తీస్తున్నారా.. లేదు కదా?
అసలు ఆ కులాల ప్రస్తావన ఏమిటో?
పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలపై మంత్రి  కె.కన్నబాబు

పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతునూ ఆదుకుంటాం
ఒక్క ఎకరా పంటను కూడా విడిచి పెట్టబోము
గులాబ్‌ తుపాన్‌లో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తాం
ఇప్పటికే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చాం
అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నాయి
వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కె.కన్నబాబు

ప్రాజెక్టులు నిండి పంటలు బాగుంటే ఓర్చుకోలేకపోతున్నారు
రాయలసీమలో వ్యవసాయం సంక్షోభంలో ఉందంటూ గగ్గోలు
ప్రభుత్వంపై బురద చల్లుతూ అసత్య ప్రచారం చేస్తున్నారు
అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ప్రాజెక్టులు పట్టించుకున్నారా
ఆనాడు రైతులను ఏ మాత్రమైనా ఆదుకున్నారా
విపక్ష టీడీపీని సూటిగా ప్రశ్నించిన మంత్రి శ్రీ కన్నబాబు

గత రెండేళ్లలో వ్యవసాయానికి అత్యధిక కేటాయింపులు
మీ 5 ఏళ్ల పాలనలో కంటే ఎక్కువగా పంటల కొనుగోలు
గతంలో ఎన్నడూ లేని విధంగా పంటల ఉత్పత్తిలో రికార్డు
గణాంకాలతో సహా వివరించిన వ్యవసాయ శాఖ మంత్రి

ప్రెస్‌మీట్‌లో మంత్రి శ్రీ కె.కన్నబాబు ఇంకా ఏమన్నారంటే..:

ఈర్ష్య, అసూయ, ద్వేషం:
పవన్‌ కళ్యాణ్‌ ఇంకా ఓటమి భారం నుంచి బయటకు రాలేదని అర్ధమవుతోంది. రెండు చోట్ల ఓడిపోయిన అవమాన భారం నుంచి ఇంకా బయటకు రాలేదని అనిపిస్తోంది. జగన్‌గారిపై ఈర్శ్య, అసూయ, ద్వేషంతో రగిలిపోతున్నాడు. అందుకే వేదిక ఏదైనా సరే ఆయన తిట్టిపోస్తున్నారు. అసలు విషయం వదిలేసి, జగన్‌గారిపై బురద జల్లుతున్నారు.

వారిది స్నేహ బంధం:
జగన్‌గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు కూడా పవన్‌కళ్యాణ్‌ జగన్‌గారినే తిట్టారు తప్ప, చంద్రబాబును ఏమీ అనలేదు. ఎందుకంటే వారి స్నేహ బంధం. అది ఇప్పటికీ విడిపోలేదు.

ఫ్రస్టేషన్‌:
ఇవాళ పవన్‌కళ్యాణ్‌ బీజేపీతో ఉన్నప్పటికీ, బహుషా టీడీపీతో ఆ బంధం ఇంకా వదులుకోలేక పోతున్నట్లు ఉంది. బీజేపీతో ఇంకా ముందుకు సాగితే ఏం ప్రయోజనం కనిపించే పరిస్థితి లేదు. ఇక తెలుగుదేశంతో మళ్లీ జత కడతామంటే ఆయన మద్దతుదారులే అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఒత్తిడిలో, ఆ ఫ్రస్టేషన్‌లో పవన్‌కళ్యాణ్‌ ఉన్నట్లు కనిపిస్తోంది.

అవాకులు చెవాకులు:
ఎంతసేపూ జగన్‌గారిపై అసూయ, ద్వేషం, కోపం తప్ప, ఏ ఒక్క రోజైనా ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరించి, నిలకడగా ఉండి, కనీసం ఒక్కటైనా సద్విమర్శ చేశారా. సినిమా ఫంక్షన్‌కు వెళ్లారు. అక్కడ సినిమా రంగం ఇబ్బందులు మాట్లాడకుండా, జగన్‌గారిపై అవాకులు చెవాకులు మాట్లాడారు.

కులాలు ఆపాదిస్తారా..:
ఒక పార్టీ వ్యవస్థాపకుడు కులాలను ఆపాదిస్తూ పబ్లిక్‌లో మాట్లాడాడు. జగన్‌గారు ఒక్కటే చెప్పారు. కులం, మతం, రాజకీయం చూడం అన్నారు. ఆయన సిద్దాంతాలను మీరు ఒప్పుకోలేక అలా మాట్లాడారు. తొలిసారిగా నిర్మాతలు, దర్శకులకు కూడా పవన్‌కళ్యాణ్‌ కులాన్ని ఆపాదించారు. ఒకవేళ కులమే ప్రాతిపదిక అయితే, ఏ కులం వారు, ఆ కులం వారితోనే సినిమాలు తీస్తున్నారా. లేదు కదా. అసలు
ఆ కులాల ప్రస్తావన ఏమిటో?

అది పాత ప్రతిపాదన:
కొందరు నిర్మాతలు, దర్శకులు ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం కావాలని కోరారు. అందుకే ఆ నిర్ణయం. నిజానికి అది ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదన అని ఆదిశేషగిరిరావుగారు చెప్పారు. నిజానికి కేంద్రంలో బీజేపీ కూడా ఆ విధానాన్ని కోరుతోంది.
ఒకవేళ మీకు అది ఇష్టం లేకపోతే ప్రధాని మోదీ గారిని కోరండి. ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం తీసేయమని. ఇష్టం వచ్చినట్లు టికెట్‌ రేట్లు పెంచుకుంటామని. ఇష్టం వచ్చినన్ని షోలు వేసుకుంటామని. నిజానికి
సినిమా రంగం మేలు కోరే వ్యక్తి అయితే ఇలా మాట్లాడతారా. అది కాకుండా జగన్‌గారిని తిట్టడం. మంత్రులను సైతం సన్నాసులు అని వ్యాఖ్యానించడం. అది మీ విజ్ఞత.
నీతి చెప్పాలంటే మనం తొలుత ఆచరించాలి. ఎదుటివారి భాష బాగా లేదన్నప్పుడు తొలుత మీరు ఆచరించి చూపాలి.

హుందాతనానికి మారుపేరు:
ఈ దేశంలో హుందాతనంతో పరిపాలిస్తున్న, వ్యవహరిస్తున్న అతి తక్కువ మంది నాయకుల్లో జగన్‌గారు ఒక్కరు. ఆయన ఏనాడూ ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడడం చూశారా. చివరకు తన దగ్గర పని చేసే అటెండర్‌ను కూడా అన్నా అని పిలుస్తారు. విపక్ష నేతలను కూడా ఆయన అన్నా అనే సంబోధిస్తారు. రేపు మీరు కలిసినా మిమ్మల్ని అన్నా అనే అంటారు. కానీ మీరు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. అంతిమ నిర్ణేతలు ప్రజలు.
ఒక నాయకుడు 10 ఏళ్ల కష్టంతో ప్రజలు ఏ విధంగా ఆదరించాలో మొన్నటి ఎన్నికల్లో చూశాం. ప్రజల్లో ఎంత నమ్మకం ఉంటే అలా గెలిపిస్తారు. అలాంటి నాయకుడిని మీరు పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అదే అంతకు ముందు ఒక కార్యక్రమంలో చిరంజీవి గారు ఎంత హుందాగా మాట్లాడారు.

చూసి నేర్చుకొండి:
అందుకే ఈర్శ్య, అసూయను పక్కన పెట్టి ఒక నాయకుడు ఎలా ఉండాలన్నది జగన్‌గారిని చూసి నేర్చుకోండి. ఇవాళ ఏ నాయకుడైనా సరే జగన్‌గారిని చూసి నేర్చుకోవాలి. నాయకులు, మంత్రులు సన్నాసులా.
అసలు పవన్‌కళ్యాణ్‌ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకున్నాడు. ఆన్‌లైన్‌ టికెట్‌ పెడితేనే అంతలా విరుచుకుపడ్డాడు. లక్షలాది మంది ఆధారపడిన పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.
ప్రజాక్షేత్రంలో జగన్‌గారి ప్రభ, ప్రజల్లో ఆయన పరపతి ఎంత బలంగా ప్రజల్లో వేళ్లూనుకుంటుందో ఇటీవలి పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత పవన్‌కళ్యాణ్‌లో ఫ్రస్టేషన్‌ ఇంకా పెరిగిందేమో అనిపిస్తుంది. సినీ పరిశ్రమ – ప్రభుత్వం మధ్య శతృత్వం పెరగాలని కొందరు ఆశిస్తున్నట్లు కనిపిస్తోందని కన్నబాబు వ్యాఖ్యానించారు.

 

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *