మేడే..గుంటూరులో భీమ్ భారత్ ర్యాలీ

పూలే లొఖాండేల వారసుడు అంబేడ్కర్
భీమ్ భారత్ అధ్యక్షుడు పాగళ్ళ ప్రకాష్

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కృషి వల్లనే దేశంలో ఎన్నో కార్మిక చట్టాలు ఏర్పడ్డాయని బీమ్ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు పాగళ్ళ ప్రకాష్ అన్నారు. పూలే, లొఖాండేలా వారసునిగా అంబేద్కర్ కార్మికవర్గ దృక్పథంతో వారి హక్కుల కోసం జీవిత పర్యంతం పోరాటం చేశారని అన్నారు. మేడే సందర్భంగా బీమ్ భారత్ ఆధ్వర్యంలో గుంటూరులోని లాడ్జి సెంటర్ లో నిర్వహించిన ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. పెట్టుబడి దారీ విధానానికి ప్రత్యామ్నాయంగా స్టేట్ సోషలిజాన్ని అంబేద్కర్ ప్రతిపాదించారు..అన్ని పరిశ్రమలనూ, భూమిని జాతీయం చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రయివేట్ రంగ కార్మికుల హక్కులను పరిరక్షించాల్సిన అవసరాన్ని అంబేద్కర్ తెలియచెప్పారని అన్నారు. ఈసీకే రాష్ట్ర అధ్యక్షులు ఎన్.జె విద్యాసాగర్ మాట్లాడుతూ కార్మిక వర్గం లో అధిక వివక్షకు గురయ్యే వర్గం మాహిళల కోసం అంబేద్కర్ ఎన్నో చట్టాలు రూపొందించారని అన్నారు. మెటర్నిటీ బెనిఫిట్స్ బిల్లు రూపకర్త కూడా ఆయనే అన్నారు. ఎలక్ట్రాకల్ యస్, యస్.టి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ రవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.