శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి ప్రారంభించామని ఈఓ లవన్న తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ. శ్రీశైలం పురవీధులలో 11 రోజుల పాటు స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం వైభవంగా నిర్వహిస్తామన్నారు. శ్రీశైలం ఆలయంలో ఈరోజు నుంచి మార్చి 4 వరకు స్వామిఅమ్మవార్ల గర్భాలయ స్పర్శ దర్శనం తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు చెప్పారు. శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు అదనంగా ఏర్పాటు చేశామని ఈవో తెలిపారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకోసం ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు. ఆన్‌లైన్ టికెట్లు బుకింగ్ తెలియని వారి కోసం శ్రీశైలంలో కొన్ని కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో లవన్న తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.