ap news

చేనేత జౌళి శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు

టెక్స్ టైల్  డిజైనర్,

క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్  నియామకాల కోసం దరఖాస్తులు 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చేనేత మరియు జౌళి శాఖలో ” టెక్స్ట్ టైల్స్ డిజైనర్, క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ ” లుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నామని చేనేత జౌళి శాఖ అడిషనల్ డైరెక్టర్ కె. శ్రీకాంత్ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం లో టెక్స్ట్ టైల్స్ డెజైనర్ 12 ఖాళీలు, క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ గా 12 ఖాళీలు ఉన్నాయని వీటిని భర్తీ చేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో అక్కుల పేట శ్రీకాకుళం జిల్లా, గొల్లప్రోలు తూర్పు గోదావరి జిల్లా, ఎమ్మిగనూరు కర్నూల్ జిల్లా, తెనాలి-1 గుంటూరు జిల్లా, రేపల్లె-1 గుంటూరు జిల్లా, ఐలవరం-1 గుంటూరు జిల్లా, మంగళగిరి- VI గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు తూర్పు గోదావరి జిల్లా, శ్రీ భావన రుషి, వేంకటగిరి, ఎస్.పే.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లా, పెనుమూరు చిత్తూర్ జిల్లా, అంగల్లు చిత్తూర్ జిల్లా, ఆదోని కర్నూర్ జిల్లా మొత్తం 12 క్లస్టర్ లు ఉన్నాయన్నారు.

ఇవీ అర్హతలు..
క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హ్యాండ్ లూమ్ టెక్నాలజీ (డి.హెచ్.టి.) డిప్లొమా కలిగి రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలన్నారు. కంప్యూటర్ నందు పరిజ్ఞానం ఉండాలని, ఎమ్.ఎస్. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పరిజ్ఞానం, రికార్డ్ లు మరియు ఖాతాల పుస్తకాల నిర్వహణ మొదలైన బాధ్యతలు క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ నిర్వహించవలసి ఉంటుందన్నారు. టెక్స్ట్ టైల్ డిజైనర్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెక్స్ట్ టైల్ డిజైన్ ఇనిస్టిట్యూట్ లో సంబంధిత కోర్సు లో ఉత్తీర్ణులై ఉండాలి. చేనేత విభాగంలో రెండు సంవత్సరాలు టెక్స్ట్ టైల్ డిజైనర్ గా పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. డిజైన్ లు, ఉత్పత్తి ల యొక్క ఉన్నతి అభివృద్ధిలో అనుభవం కలిగి ఉండాలి. టెక్స్ట్ టైల్ డిజైనర్ 12 ఖాళీలు, క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ కు 12 ఖాళీలు ఉన్నాయని వీటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హత అనుభవం, వయస్సు, నివాసం మొదలైన వాటి ఆధారంగా మెరిట్ పై ఎంపిక చేయబడుతుందన్నారు. దరఖాస్తు దారుడు ధ్రువ పత్రాలతో పాటు బయో డేటా సమర్పించాలని మరిన్ని వివరాల కోసం, క్లస్టర్ మార్గ దర్శకాల కోసం www.handlooms.nic.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచామన్నారు. టెక్స్ట్ టైల్స్ డిజైనర్ గా, క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ లు గా నియామకం కాంటాక్ట్ ప్రాతిపదికన మూడు సంవత్సరాలు ఉంటుందని నెలకు 30 వేల రూపాయలు కన్సాలి డేటెడ్ జీతం ఇస్తారని అడిషనల్ డైరెక్టర్ కె. శ్రీకాంత్ ప్రభాకర్ అన్నారు. టెక్స్ట్ టైల్ డిజైనర్, క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జికుటివ్ గా తమ సేవలు అందించడానికి ఆసక్తి గల అభ్యర్థులు ప్రకటన ప్రచురించిన తేదీ నుండి 21 రోజులు లోపుగా సంచాలకులు, చేనేత జౌళి శాఖ, డో. నెం. 11-694, ఆప్కో సముదాయం, పాత జి.టి. రోడ్, ఎర్రబాలెం గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, పిన్ కోడ్ 522503 కు పోస్ట్ ద్వారా గాని, స్వయంగా గాని పంపించ వచ్చునని శ్రీ కె. శ్రీకాంత్ ప్రభాకర్ అన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *