గవర్నర్ దంపతులతో సీఎం దంపతుల భేటీ
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిలు సోమవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం, గవర్నర్ లిద్దరూ సుమారు 30 నిముషాలు భేటీ అయి సమకాలీన రాజకీయాలు, ఏర్పడుతున్న పరిణామాలపై చర్చించారు. ఈనెల 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరారు. జిల్లాల పునర్విభజన, వాటి ప్రాతిపదిక, ప్రాధాన్యతలను ఈ సందర్భంగా గవర్నర్ కు సీఎం వివరించారు.