పురపాలక శాఖ కమిషనర్ గా ప్రవీణ్ కుమార్
పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ గా ఐఎఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని పురపాలక శాఖ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన అనంతరం అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. వివిధ విభాగాల్లో నిర్వహిస్తున్న కార్యకలాపాలు, వాటి ప్రగతిపై సమీక్షించారు.