ap news

పాఠశాలల స్థాయి నుంచే నైపుణ్య శిక్షణ

రీడిజైన్ కు స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ శాఖ ప్రాధాన్యత 

డిస్ట్రిక్ స్కిల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (డీఎస్డీఏ) ఏర్పాటుకు శ్రీకారం

జాయింట్ డైరెక్టర్ హోదాలోని అధికారి ద్వారా మానిటరింగ్

యువతకు ఏపీఎస్ఎస్డీసీ, సీడాప్ ఆధ్వర్యంలో శిక్షణ

నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

పాఠశాలల స్థాయి నుంచే నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు అమలు చేయాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కొత్త ఏడాది సరికొత్త విధానాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్ఎస్డిసి)తోపాటు ఇతర నైపుణ్యశిక్షణ విభాగాలు కూడా శ్రీకారం చుట్టాలన్నారు. ఇందుకోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖను పునర్ వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా సీడాప్, ఉపాధి, శిక్షణ సహా పలు విభాగాలను నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ కిందకు తీసుకువచ్చే అంశంపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ఉన్నతాధికారులతో మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యువతకు ఏపీఎస్ఎస్డీసీ, సీడాప్ ఆధ్వర్యంలో అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను ఆయనకు అధికారులు వివరించారు. చర్చించారు. సీడాప్ నుంచి 150, ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో 350 శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, ఇందులో కొన్నింటికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నట్లు మంత్రికి అధికారులు వివరించారు. అందులో భాగంగా జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ స్కిల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (డీఎస్డీఏ) ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ముగ్గురు డిప్యూటి డైరెక్టర్లు, ఒక అకౌంట్ ఆఫీసర్ తో కూడిన ఏడుగురు సభ్యులతో క్షేత్రస్థాయిలో శిక్షణ కార్యక్రమాల నిర్వహణకై రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. శిక్షణా కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలో జాయింట్ డైరెక్టర్ హోదాలోని అధికారి ఉంటే బాగుంటుందని మంత్రి అధికారులకు సూచించారు. డిస్ట్రిక్ స్కిల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (డీఎస్డీఏ) కార్యక్రమాలు, ప్రణాళికలు, శిక్షణలను రాష్ట్ర స్థాయిలో పరిశీలించే వ్యవస్థ ఉండాలన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ బడ్జెట్, ఆర్థికపరమైన విషయాలపైనా నైపుణ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి చర్చించారు. అంతేకాకుండా ఉపాధి,శిక్షణకు సంబంధించిన ఏడాది బడ్జెట్ వివరాలను ఆ సంస్థ డైరెక్టర్ లావణ్యవేణిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి ఏపీఐఐసీలోని మంత్రి కార్యాలయంలో జరిగిన సమీక్షకు ఎపిఎస్ఎస్డిసి ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, ఏపీ సీడాప్ ఛైర్మన్ రామస్వామి, నైపుణ్యాభివృద్ధి,శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ లావణ్యవేణి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ) చల్లా మధుసూదన్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఉపాధి, శిక్షణ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అదికారులతో మాట్లాడుతున్న మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *