ఏపీ పోలీస్..మరో ఘనత

  • టెక్నాలజీ విభాగంలో 20 అవార్డులు 
  • ఆరు రజత పతకాలు 

జాతీయ స్థాయిలో టెక్నాలజి వినియోగంలో ఏపీ పోలీస్ శాఖ 20 అవార్డులు దక్కించుకుంది. వీటిలో 6 రజతపతకాలు కూడా ఉన్నాయి. స్కొచ్ గ్రూప్ ప్రకటించిన అవార్డులలో ఇదివరకే 75 అవార్డులను దక్కించుకోగా, తాజాగా మరో 20 అవార్డులను కైవసం చేసుకొని మొత్తం 95 అవార్డ్ లను గెలుచుకుంది. టెక్నాలజీ వినియోగంలో జాతీయస్థాయిలో 150 అవార్డులతో మొదటి స్థానంలో  ఏపీ పోలీస్ శాఖ నిలిచింది. జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలను సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు డిజిపి  గౌతం సవాంగ్ అభినందించారు. అవార్డులు అందుకున్న వారిలో పోలీస్ ప్రధాన కార్యాలయం తో పాటు అనంతపురం  చిత్తూరు,  కృష్ణ , తిరుపతి అర్బన్,  కడప, పోలీస్ బెటాలియన్ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.