తిరుపతి ప్రజలకు అండగా టిడిపి

  • ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో సేవలందించండి
  • ఆపన్నులకు అన్నివిధాల సహాయ, సహకారాలు
  • తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు

తిరుపతి, తిరుమలలో భారీవర్షాల కారణంగా సంభవించిన జలప్రళయంలో నిరాశ్రయులైన నగరప్రజలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అండగా నిలవాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అవసరమైన చోట్ల అధికార యంత్రాంగం సహకారంతో భక్తులకు అండగా నిలవాలని ఆయన విజ్జప్తి చేశారు. వేంకటేశ్వరుని దర్శనం కోసం తిరుపతి వచ్చి వరదల్లో చిక్కుకున్న భక్తులకు అన్నివిధాల సహయ, సహకారాలు అందించాలని కోరారు. భక్తులకు, తిరుపతి నగర ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ సైతం తమవంతు సహాయం అందజేస్తుందని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం సంభవించకుండా జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబునాయుడు సూచించారు. భారీవర్షాలపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ఉపద్రవం సంభవించిందని, ఇప్పటికైనా మేల్కొని యుద్దప్రాతిపదికన సహాయచర్యలు చేపట్టాల్సిందిగా చంద్రబాబునాయుడు విజ్జప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published.