బాలినేని పాపాలు ఎక్కువయ్యాయి

మూల్యం చెల్లించుకోక తప్పదు
అయిదుసార్లు ఎమ్మెల్యే..ఏం చేశావ్..
ధ్వజమెత్తిన దామచర్ల జనార్దన్

అయిదుసార్లు ఒంగోలుకు ఎమ్మెల్యేగా ఉన్నావ్..ఏం చేశావ్ అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రశ్నించారు. మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేయమంటూ పశ్చిమ ప్రాంత ప్రజల గగ్గోలు పెడుతున్నా నీకు వినిపించుకునే ఓపిక లేదు..నిరాహార దీక్షలు చేస్తుంటే వారిని పలకరించిన పాపాన పోలేదు..ఎర్రగొండపాలెంకు ఒంగోలు ఎంత దూరం..జిల్లా కేంద్రానికి వచ్చి పోవాలంటే వారికెంత ఖర్చవుతుందో తెలుసా..నీకంటే డబ్బులొస్తాయ్..వారికెక్కడ వస్తాయ్ అని బాలినేనిని ఘాటు గా ప్రశ్నించారు. అద్దంకి ఎక్కడుంది..బాపట్లకు ఎంత దూరం..కందుకూరును తీసుకెళ్లి నెల్లూరులో కలుపుతారా..! పాపాలెక్కువయ్యాయి బాలినేనీ..మూల్యం చెల్లించుకోక తప్పదంటూ జనార్దన్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published.