ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ను దర్శించుకున్న చంద్రబాబు నాయుడు

పెద్ద ఎత్తున తరలివచ్చి పార్టీ అధినేతకు బర్త్ డే విషెస్ చెప్పిన కార్యకర్తలు, నేతలు

వేల మంది కార్యకర్తల శుభాకాంక్షలు అందుకుని ప్రతి ఒక్కరినీ కలిసిన అధినేత

అమరావతి:-టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయానికి తరలి వచ్చిన కార్యకర్తలు, నేతలు అధినేతకు శభాకాంక్షలు తెలిపారు. ఉదయం చంద్రబాబు నివాసం వద్ద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చంద్రబాబు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి నేతలతో కలిసి వెళ్లారు. దుర్గగుడి వద్ద ఆలయ ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు.అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు….ప్రజల పక్షాన పోరాడడానికి తనకు శక్తినివ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. రాజీ లేని పోరాటంతో తెలుగు వారికి పూర్వ వైభవం తీసుకువస్తానని చెప్పారు. అనంతరం పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు క్యాడర్ ఘన స్వాగతం పలికారు. పార్టీ నేత ఎంఎస్ రాజు క్రేన్ ద్వారా భారీ పూల మాల వేసి అధినేత కు స్వాగతం పలికారు.

పుట్టినరోజు సందర్భంగా మసీదులో ప్రార్ధనలు

అనంతరం మూడు మతాలకు చెందిన మత పెద్దలు చంద్రబాబుకు ఆశ్వీర్వచనం అందించారు. మరో నేత కొమ్మారెడ్డి కిరణ్ ఏర్పాటు చేసిన భారీ కేక్ ను నేతల సమక్షంలో కట్ చేశారు. తెలంగాణ నుంచి సైకిల్ యాత్ర ద్వారా వచ్చిన తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జయరాం తో పాటు ఇతర నాయకులు చంద్రబాబు ను కలిసి పార్టీ కార్యాలయం శుభాకాంక్షలు తెలిపారు.జన్మదినం సందర్భం గా రాష్ట్రం లోని అన్ని జిల్లాల నుంచి వేలాది గా తరలి వచ్చిన వారితో పార్టీ కార్యాలయం కిటకిటలాడింది. వచ్చిన వేల మంది లో ఎవరిని కాదనకుండా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగారు. అందరి నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. అధినేత జన్మదినం సందర్భంగా గా పార్టీ నేతలు కొందరికి నిత్యావసర వస్తువులు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

Leave a Reply

Your email address will not be published.