పర్యాటక రంగానికి చేయూత : ఆర్.కె రోజా

సింగిల్ అప్లికేషన్ సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి ఆర్.కే రోజా అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హోటల్స్ అసోసియేషన్, తిరుపతి హోటల్స్ అసోసియేషన్  సంయుక్తంగా గురువారం తిరుపతిలో ఏర్పాటుచేసిన అభినందన సభలో ఆమె మాట్లాడారు. పర్యాటక, ఆతిధ్య రంగంలో పురోబివృద్ది దిశగా అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. ఏ.పి హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ హోటల్స్ తెరిచే ఉంచే సమయాన్ని రాత్రి 12 గంటల వరకు పొడిగించాలని కోరారు. ఆథిత్య రంగాన్ని, హోటళ్ళను పరిశ్రమలుగా గుర్తిస్తే రాయితీలకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి  రోజా మాట్లాడుతూ హోటల్ టైమింగ్ జి.ఓ మేరకు అమలు అయ్యే విధంగా, హోటల్ లైసెన్స్ పర్మిషన్ కోసం సమర్పించే డాక్యుమెంట్స్  మహారాష్ట్ర తరహాలో తక్కువ ఉండేలా చూస్తాననన్నారు. చంద్రగిరిలో సౌండ్ అండ్ లైట్స్ షో పునరుద్ధరణ, టి.టి.డి దర్శన్ టికెట్స్ హోటల్ అసోసియేషన్ వారికి కేటాయింపు విషయంలో టిటిడిని సంప్రదిస్తామని తెలిపారు. తిరుపతి ఎస్.వి జూ పార్క్ లో పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఎలక్ట్రికల్ వాహనాలను అనుమతి ఇవ్వమని హోటల్ యజమానులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెలాఖరు లోగా టూరిజంకు సంబంధించి సమగ్ర ప్రణాళిక తయారు చేస్తామనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఆధ్వర్యంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఏ.పి హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ రెడ్డి, తిరుపతి హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణా బట్, తదితర హోటల్ యజమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.