ap news

3254 వ్యాధులకు ఆరోగ్యశ్రీలో చికిత్స

అక్టోబర్ 15 నుంచి  3,254 ప్రొసీజర్ల అమలు 
• ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి 2వేల కోట్ల వ్యయం.. గత మూడేళ్లలో 6వేల కోట్లు ఖర్చు..
• 942 ప్రొసీజర్స్ తో ఆరోగ్యశ్రీ ప్రారంభించిన దివంగత నేత వైఎస్సార్..
• గత ప్రభుత్వ హాయాంలో కేవలం 117 ప్రోసీజర్లు మాత్రమే పెంపు..
• మెరుగైన వైద్యం అందించడంలో ఏపీ దేశానికే రోల్ మోడల్..
• 8 వేల కోట్లతో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు..
• నాడు కింద రూ.3,820 కోట్లతో 11 మెడికల్ కాలేజీలు ఆధునీకరణ..
• వైద్యారోగ్యశాఖ మంత్రి విడుదల రజని వెల్లడి..

మీడియా సమావేశంలో మాట్లాడుతున్నవైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని

పేద ప్రజలకు మేలు చేకూరే విధంగా రాష్ట్రంలో అక్టోబర్ 15 నుంచి ఆరోగ్యశ్రీ కింద 3,254 ప్రొసీజర్లకు పెంచనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి విడుదల రజని వెల్లడించారు. 2007లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గొప్ప ఆలోచనతో 942 ప్రొసీజర్స్ తో ఆరోగ్యశ్రీని ప్రారంభిస్తే.. తండ్రికి తగ్గ తనయుడుగా తండ్రి బాటలో నడుస్తూ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 1059 ఉన్న ప్రొసీజర్స్ ను 2,446కు పెంచారని, ఈ నెల 15 నుంచి 3,254 ప్రొసీజర్స్ ప్రజలకు అందుబాటులోకి రానున్నారని, ఇది చాలా శుభపరిణామని మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ ఆర్ అండ్ బి భవనంలో కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రి మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి విడదల రజని మాట్లాడుతూ.. ఎంత ఖర్చైనా పేదవాడికి మంచి వైద్య అందించడానికి జగనన్న ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. గతప్రభుత్వ ఐదేళ్ల పాలనలో కేవలం 117 ప్రొసీజర్లు మాత్రమే పెంచిందన్నారు. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఏటా 2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని, గత మూడేళ్లలో 6 వేల కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. హై ఎండ్ ప్రొసీజర్స్ కి అదనంగా అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే రోల్ మోడల్ గా ఉందని మంత్రి విడదల పేర్కొన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలనేదే జగనన్న లక్ష్యమని.. గత ప్రభుత్వాలు వైద్య రంగంపై నిర్లక్ష్యం వహిస్తే.. జగనన్న ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాడు-నేడు కింద 16 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏటా 13 వేల కోట్లు వైద్య, ఆరోగ్య రంగానికి ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. గతంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే.. మన్యం జిల్లాతో కలిపి మరో 17 కొత్త మెడికల్ కాలేజీలు రూ.8 వేల కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గతంలో ఉన్న 11 మెడికల్ కాలేజీల్లో రూ.3,820 కోట్లతో నాడు-నేడు కింద ఆధునీకరణ చేస్తూ ముఖ్యమంత్రి వైద్య రంగానికి మహర్థశ తీసుకొస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బకాయిలు పెడితే.. రూ.632 కోట్లను జగనన్న ప్రభుత్వమే చెల్లించిందన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్నవైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని..పాల్గొన్న అధికారులు

రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని.. వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, అర్బన్ హెల్త్ సెంటర్లు, తల్లీ, బిడ్డ ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు తదితర వాటిద్వారా వైద్యం అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న కార్డుదారుల్లో 85 శాతం మంది ఆరోగ్యశ్రీ పరిధిలో సేవలు అందిస్తూ.. పేద ప్రజలకు న్యాయం చేస్తున్నది జగనన్న ప్రభుత్వమేనని ఆమె తెలిపారు. క్యాన్సర్ కి కూడా అత్యుత్తమ చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కొన్ని పత్రికలు పనిగట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని, ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని.. అయినా ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి తెలిపారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి పీహెచ్‌సీ ని నాడు-నేడులో భాగంగా ఆధునీకరిస్తుంటే ఒక పత్రిక ‘నీరుగారుతున్న నాడు-నేడు’ శీర్షికతో తప్పుడు కథనాలను ప్రచురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయితే కనీస పరిజ్ఞానం లేకుండా సీహెచ్‌సీ అని రాశారని.. అయితే అక్కడ వైద్య సేవలు అందడం లేదని గానీ, సిబ్బంది కొరత గానీ ఏ విధమైన ఫిర్యాదులు లేవని, ఆధునీకరణ జరిగే సమయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని దానిపై దుష్ర్పచారం చేయడం తగదని ఆమె అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎలుకలు కొరికి పసిపిల్లలు మృతి చెందినా.. కరెంటు పోతే డాక్టర్లు సెల్ ఫోన్ వెలుతురులో ఆపరేషన్లు చేసిన సంఘటనలు జరిగినా.. ఆ పత్రిక మాత్రం వాటిని ప్రచురిచంలేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టీ కృష్ణబాబు, కమిషనర్ జె. నివాస్, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *