కొవ్వూరులో బాబు రోడ్ షో : పోెటెత్తిన జనం
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో రోడ్ షోలో టిడిపి అధినేత ప్రసంగం హైలెట్స్
• అడుగడుగునా జనం తరలి రావడంతో రోడ్ షోలు ఆలస్యం అవుతున్నాయి.
• పశ్చిమ గోదావరి జిల్లాలో వందల సార్లు తిరిగి ఉంటాను….పుష్కరాల్లో కూడా ఇక్కడే ఉన్నా. కానీ జీవితంలో ఇంత స్పందన ఎప్పుడూ చూడలేదు.
• తెలుగు తమ్ముళ్లు ఆవేశంతో ఊగిపోతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించాలని జనం ఊగిపోతున్నారు.
• నిత్యావసర వస్తువుల ధరలు భారంగా మారిపోయాయి. మంచి తిండి కూడా తినలేని పరిస్థితి
• కరెంట్ చార్జీలు, ఆర్టిసి టిక్కెట్ ధరలు పెరిగాయి. చివరికి చెత్తమీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్
• జగన్ వరదలకు వెళ్లి నవ్వుతాడు…పరామర్శకు వెళ్లి నవ్వుతాడు…ఏం చెప్పాలి ఈ సిఎంకు.?
• పోలవరం 72 శాతం పూర్తి చేసిన నన్ను పోలవరం వెళ్లకుండా అడ్డుకున్నారు.
• పోలవరంలో కీలక పనులు అన్నీ నాడు పూర్తి చేశాం.
• 2019 మేలో జగన్ ఐరన్ లెగ్ వచ్చింది…పోలవరంపై పడింది.
• బాధ్యత ఉండే సిఎం అయితే తెలియని విషయాలు తెలుసుకోవాలి
• పుట్టుకతో అన్నీ తెలియవు…నలుగురితో మాట్లాడి తెలుసుకోవాలి
• ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలవరం రివర్స్ టెండర్ చేశాడు.
• పోలవరం ప్రాజెక్టు నీళ్ల పాలు అయ్యింది.
• 7 మండలాలు ఎపిలో కలిపితేనే సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాను అని నాడు చెప్పాను.
• దీంతో 7 మండలాలు కేంద్ర ప్రభుత్వం ఏర్పడక ముందే ఎపిలో కలిపారు
• చిన్నబిడ్డను పెంచినట్లు పోలవరాన్ని పెంచాను.
• పోలవరంను చూసి ఇదేం ఖర్మ అని అనిపిస్తోంది.
• పోలవరం వచ్చి ఉంటే అన్ని ప్రాంతాల్లో నీళ్లు ఇచ్చే వాళ్లం
• పోలవరం కల నిజం అయ్యే సమయంలో జగన్ వచ్చి నాశనం చేశాడు.
• పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల వరకే కట్టి దాన్ని బ్యారేజ్ గా మారుస్తాడట
• పోలవరం నీళ్లు వస్తే నాకు ఒక్కడికే లాభమా…ప్రజల కోసం పోలవరం కట్టాలి అనుకున్నాను.
• పోలవరం చూడడానికి వెళితే పోలీసు అధికారులు రావడానికి వీలు లేదు అంటున్నారు.
• పోలవరం నిర్మాణం చేసిన నాకే వెళ్లడానికి హక్కు లేదు అంటే ఎలా.?
• ఈ రాష్ట్రంలో ఒక ఉన్మాది పాలన నడుస్తుంది
• ఈ సైకో పాలన వద్దు…సైకిల్ పాలన కావాలి
• అప్పుడే మనం జీవితాలు ఆనందంగా ఉంటాయి
• తమ బిడ్డల భవిష్యత్ బాగుండాలి అంటే మళ్లీ టిడిపి రావాలి అని జనం కోరుకుంటున్నారు.
• రాష్ట్ర వ్యాప్తంగా ఇదే స్పందన కనిపిస్తుంది.
• తమ్ముళూ మళ్లీ జాబు రావాలి అంటూ బాబు రావాలి అని అంతా అంటున్నారు
• 2014 తరువాత రాష్ట్రానికి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చాను. 5 లక్షల మందికి ఉద్యోగాలు తెచ్చాను
• నాడు తెలంగాణలో నా తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు, వైఎస్ ఆర్ హైటెక్ సిటీ కూలగొట్టి ఉంటే హైదరాబాద్ అభివృద్ది జరిగేదా.?
• జగన్ మూడున్నరేళ్లలో ఒక్క రూపాయి పెట్టుబడి తెచ్చాడా…ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చాడా..?
• నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు….మళ్లీ గెలిస్తే నేనేమన్నా రికార్డు క్రియేట్ చేస్తానా..?
• ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు సిఎంగా రికార్డు నా పేరుతోనే ఉంది
• నాకు సిఎం పదవి కాదు…నా అవేదన, తపన ఈ రాష్ట్రం గురించి.
• పాలకులు కొత్త పాలసీ తీసుకువస్తే పదిమందికి మేలు జరగాలి అని కోరుకుంటారు
• కానీ రాష్ట్రంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. స్వార్థం అవినీతి వల్ల ధాన్యం డబ్బులు కూడా దక్కని పరిస్థితి
• జగన్ విధానం వల్ల ఆక్వా రంగం పూర్తిగా దబ్బతింది. దీనిపై ఆధారపడిన వారు నష్టపోయారు
• రాష్ట్రంలో ఒక్క రైతు కూడా ఆనందంగా లేడు. ఒక్కో రైతుపై సగటున రూ. 2.74 లక్షల అప్పు ఉంది
• రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఎపి మూడో స్థానంలో ఉంది.
• ఈ స్థాయిలో ప్రభుత్వ ఆస్తులు ఎవరైనా తాకట్టు పెట్టారా…ఇన్ని అప్పులు చేశారా
• మీరు ఇలాగే ఉంటే మీ ఆస్తులు కూడా తాకట్టు పెడతారు.
• అప్పులు చేసే ముఖ్యమంత్రి సమర్థుడా…సంపద సృష్టించేవారు సమర్థులా.?
• సంపద సృష్టి తెలిసిన పార్టీ తెలుగు దేశం పార్టీ
• హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టిన తరువాత అక్కడ ముఖచిత్రం మారిపోయింది
• అలాగే చేద్దాం అంటే అమరావతిలో 33 వేల ఎకరాలు రైతులు ఇచ్చారు.
• అమరావతి పూర్తి చేసి ఉంటే 3 లక్షల కోట్ల ఆస్తులు రాష్ట్రానికి వచ్చేవి
• అమరావతికి కులం పేరు పెట్టి దాన్ని చంపేశారు
• నేను ఎప్పుడైనా ఒక్క కులానికి మద్దతు ఇచ్చిన సందర్భం ఉందా.?
• నా పక్కన నలుగురు ఉంటే…వాళ్లు ఎవరు అనేది కూడా చూసుకుంటా…అంత ప్రాధాన్యం ఇస్తాను
• సిఎం, డిజిపి, సిఎస్, సలహా దారు సజ్జల అంతా కడప జిల్లానే
• రాష్ట్రాన్ని సాయిరెడ్డి, సజ్జల రెడ్డి, పెద్ది రెడ్డి, వైవి సుబ్బారెడ్డికి అప్పజెప్పాడు..మీ పార్టీలో ఇక వేరే మగాళ్లు లేరా…అంతా ఒక వర్గం వాళ్లే ఉండాలా
• వెనుకబడిన వర్గాలకు ఏం పదవులు ఇచ్చారో ఈ సిఎం చెప్పాలి.
• మేం బిసిలకు చేం చేశామో చెపుతాం…చర్చకు సిద్దమా
• నా జీవితం తెరచిన పుస్తకం…ఎప్పుడూ తప్పు చెయ్యను.
• అసత్య ప్రచారాలు చేసి రాజకీయ లబ్ది పొందాలి అని చూస్తే ఉతికి ఆరేస్తాను
• అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని జగన్ తీసివేశాడు
• తమిళనాడులో అమ్మ క్యాంటీన్ ను కొత్తగా వచ్చిన సిఎం స్టాలిన్ దాన్ని కొనసాగించాడు
• అధికారంలోకి వచ్చిన తరువాత అన్నా క్యాంటీన్ ను ప్రతి మండలంలో పెడతాను.
• 200 రూపాయాల పెన్షన్ 2,000 చేసింది ఎవరు….ఇదీ సంక్షేమం అంటే
• జగన్ పెన్షన్ 3 వేలు చేస్తాను అన్నాడు…చేశాడా.?
• చంద్రన్న బీమా కింది సహజ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాద మరణానికి రూ.5 లక్షలు ఇచ్చాను
• ప్రజలకు ఇచ్చే బీమా పైనా కోతలు పెట్టారు.
• విద్యార్థులకు విదేశీ విద్య రావడం లేదు. రంజాన్ తోఫా రావడం లేదు…సంక్రాంతి కానుక రావడం లేదు
• ఎస్సి, ఎస్టి, ముస్లింలకు న్యాయం చెయ్యకుండా ఏ చేశాడు ఈ సిఎం.?
• జగన్ సంక్షేమ బటన్ నొక్కడం అనేది పెద్ద యాక్షన్. సాయంత్రం బటన్ నొక్కి మద్యం, శాండ్ డబ్బు తెచ్చుకుంటాడు.
• ప్రజల మెడమీద కత్తిపెట్టి మీ ఆస్తి ఇస్తావా చస్తావా అంటే ఏం చేస్తారు. రాసి ఇస్తారు.
• ఇప్పుడు విశాఖలో అదే జరిగింది. అక్కడ అలాగే ఆస్తులు ఆక్రమించారు
• ఆస్తుల కంటే ప్రాణం ముఖ్యం అని ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది
• మనలను రక్షించడానికి పోలీసులు రారు…మనం ప్రశ్నిస్తే మాత్రం పోలీసులు గోడలు దూకివస్తారు
• పోలీసులపైనా ఒత్తిళ్లు ఉన్నాయి…..వారికి సమయానికి జీతాలు రావడం లేదు.
• ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి టైటిల్ పూర్తిగా నప్పింది
• నా కంటే ప్రజలు ఎక్కువ ఆవేశంగా ఉన్నారు.
• నేను సిఎంగా ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు వచ్చాయా…పోలీసులు అనవసరంగా గోడలు దూకారా…ఇప్పుడు ఎందుకు పోలీసులు అలా చేస్తున్నారు.?
• ఈ సారి రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే….2024 ఎన్నికలు రాష్ట్రానికి చివరి ఎన్నికలు అవుతాయి
• సెల్ ఫోన్ తిండిపెడుతుందా అని రాజశేఖర్ రెడ్డి అడిగాడు…..సెల్ ఫోన్ ఏం చేస్తుందో చూడు అని నాడు అన్నాను.
• ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండలేని పరిస్థితి
• జిల్లా పర్యటనలో నా నడుంలు విరిగిపోయాయి. రేపు డాక్టర్ వద్దకు వెళ్లాలి. అంత దారుణంగా రోడ్లు ఉన్నాయి.
• నాడు మలేషియా రోడ్లు చూసి ప్రధాని వాజ్పేయి వద్ద రోడ్లపై ప్రతిపాదనలు ఉంచాను.
• నాటి ఆ ప్రతిపాదనల కారణంగా బివోటి కింద నెల్లూరు, చెన్నై రోడ్డు వచ్చింది
• ఆ తరువాతనే గోల్డెన్ క్వార్డలేటరల్ ప్రాజెక్ట్ వచ్చింది
• అనేక అంశాల్లో సంస్కరణలకు నాడు నాంది పలికాను. ఆ ఫలితాలు మనకు దక్కాయి
• పిల్లలకు జగన్ కంసమామ…ప్రజలకు భస్మాసుర మామ
• శివుడి వద్ద వరం తీసుకుని భస్మాసురుడు శివుడినే భస్మం చెయ్యాలి అనుకున్నాడు
• జగన్ కు బ్లూ మీడియా ఉంది…వాలంటీర్లు ఉన్నారు….
• నాకు ప్రజల ఉన్నారు. బ్లూ మీడియాను పెట్టుకుని జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు
• తన సభకు నల్ల చున్నీలతో వచ్చారని మహిళల చున్నీలు లాగేశారు.
• నాపై అవినీతి ఆరోపణలు చేసి తవ్వుతూనే ఉన్నాడు. తవ్వి తవ్వి ఏం చేస్తాడు. ఎలుక తోకను కూడా పట్టుకోలేడు
• మహిళలకు గౌరవం పెంచిన పార్టీ తెలుగు దేశం పార్టీ. మహిళలకు విద్యలో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం
• ఆడబిడ్డల తల్లిదండ్రులను గౌరవంగా చూసే పరిస్థితి తీసుకువచ్చింది టిడిపినే.
• జగన్ రాష్ట్రానికి పట్టిన శని…దాన్ని వచ్చే ఎన్నికల్లో వదిలించుకుందాం
• ప్రజల్లో ఉత్సాహం చూసిన తరువాత నాకు నమ్మకం కలిగింది.
• ఎప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్ ను, వైసిపిని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు
• నీ ముద్దులుపోయి గుద్దులు మిగిలాయి అని జగన్ కు చెప్పండి. గట్టిగా ప్రశ్నించండి.