బాబూ..చీకట్లో చూస్తావా పోలవరం
– పోలవరం వద్ద రక్తికట్టని చంద్రబాబు డ్రామా
– చీకట్లో ప్రాజెక్టు చూస్తానంటూ హడావిడి చేయడమేమిటి..?
– మా ప్రశ్నలకు జవాబివ్వవేం బాబూ..?
– బాబుకు వత్తాసు పలికే ఎల్లోమీడియాకు వీటిపై విశ్లేషణ చేసే దమ్ముందా..?
– పోలవరం గేట్లు పట్టుకుని ధర్నా చేయడం.. నిజంగా బాబు ఖర్మే
-రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి శ్రీ అంబటి రాంబాబు
– పోలవరాన్ని బాబు నశ్చర్ చేయడం కాదు.. రప్చర్ చేశాడు.
– ఎవరికో పుట్టిన బిడ్డను ముద్దాడే అలవాటు బాబుది.. అందుకే పోలవరం నా బిడ్డ అంటున్నాడు
– పోలవరం పూర్తికాకపోవడానికి చంద్రబాబే కారణం
– పోలవరం ప్రాజెక్టును టీడీపీ ఏటీఏంగా వాడుకుంది
– కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రంవాల్ నిర్మించారు కనుకే కొట్టుకుపోయింది.
– పీపీఏ ప్రభుత్వాన్ని తప్పుబట్టిందనడం అబద్ధం..
– పోలవరం ముమ్మాటికీ గౌరవ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారే పూర్తిచేయడం ఖాయం
– పోలవరం ప్రాజెక్టు చూస్తానంటూ చీకట్లో చంద్రబాబు చేసిన హైడ్రామా సంగతిని ముందుగానే పసిగట్టి, బాబు డ్రామాల గురించి ఈరోజు ఉదయమే మీడియాకు చెప్పాను. చివరికి అదే జరిగింది.
-ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధిలేని చంద్రబాబు రాత్రి ఏడు గంటలప్పుడు వందలాదిమందితో పోలవరం చూస్తానని రగడ చేయడం ఆయన సిగ్గుమాలినతనానికి నిదర్శనం.
-తాను గతంలోనే సంధించిన మూడు ప్రశ్నలకు చంద్రబాబు ఈరోజు వరకూ సమాధానం చెప్పకుండా.. పోలవరం అంటూ రంకెలేయడం ఎంతవరకు సబబు.
– విభజన చట్టంలో కేంద్రమే పూర్తినిధులతో చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను తీసుకుని, గత చంద్రబాబు ప్రభుత్వం పోలవరంను ఒక ఏటీఏంగా వాడుకున్నారు. ఈరోజుకూ పోలవరం పూర్తికాకపోవడానికి అసలు కారణం చంద్రబాబేనని మంత్రి స్పష్టం చేశారు.
ప్రెస్‌మీట్‌లో మంత్రి శ్రీ అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే, ఆయన మాటల్లోనే..
నేను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చంద్రబాబును మూడు ప్రశ్నలకు సమాధానం అడిగాను. ఆయన నా ప్రశ్నలకు జవాబివ్వలేదు. బాబు చేపట్టిన ఇదేం ఖర్మ సభల్లో అయినా నా ప్రశ్నలకు సమాధానమివ్వాలి. కనీసం, ఆయనకు వత్తాసు పలికే ఎల్లోమీడియాకు మా ప్రశ్నలపై విశ్లేషణలు చేసే దమ్ము ఉందా..?
మొదటి ప్రశ్న..
కేంద్ర విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తినిధులతో చేపట్టాలని ఉంది. అయితే, ఆ చట్టాన్ని పక్కనబెట్టి మేమే పూర్తిచేస్తామని.. నిధులు మాకే కావాలంటూ చంద్రబాబు ఎందుకు భుజాన వేసుకున్నాడు..?
రెండోప్రశ్న..
2018కి పోలవరం పూర్తిచేసి,లెఫ్ట్ అండ్ రైట్ కెనాళ్లకు నీళ్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తామని శాసనసభ సాక్షిగా బల్లగుద్ది సవాల్ చేసి చెప్పిన చంద్రబాబు ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయలేదు…?
మూడోప్రశ్న..
కాఫర్ డ్యాం నిర్మాణం లేకుండా డయాఫ్రంవాల్ ఎలా నిర్మించారు..? ఇది చరిత్రాత్మక తప్పిదం కాదా..?
ఈ మూడు ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ.. ప్రజలకు అబద్ధాలు చెబుతూ మభ్యపెట్టాలనుకోవడం చంద్రబాబు సిగ్గుమాలినతనం.
– చంద్రబాబు బుర్రాబుద్ధిలేకుండా తీసుకున్న నిర్ణయాలతో డయాఫ్రం వాల్ వరదల్లో కొట్టుకుపోవడం వలనే ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనులు మందగించాయి. చంద్రబాబు శాసనసభకు రాకుండా రోడ్లు పట్టుకు తిరగడం ఆయన ఖర్మనే.. ఈరోజు పోలవరం గేట్లు పట్టుకుని ధర్నాకు దిగడం నిజంగా చంద్రబాబు ఖర్మగానే చెప్పుకోవాలి.
ఎవరికో పుట్టిన బిడ్డను నాది అంటావా బాబూ?
– ఎవరికో పుట్టిన బిడ్డను ముద్దాడే సంస్కృతి బాబుది..
పోలవరం నా బిడ్డ.. అనడంలో చంద్రబాబు అబద్ధాల చరిత్రను అందరూ తెలుసుకోవాలి. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీని.. ఆపార్టీ జెండాను ఈరోజు నాది అంటాడు. అలాగే, మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు చేపట్టిన పోలవరం ప్రాజెక్టు కలను ఈరోజున ఆయన తనయుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు పూర్తి చేస్తున్నారు. పోలవరంను బాబు నశ్చర్ చేయడం కాదు.. రప్చర్ చేశాడు.
-రాష్ట్రంలోని మేధావులకు మనవి చేస్తున్నా.. చంద్రబాబుకు మతిస్థిమితం తప్పింది. వందలాదిమందితో రాత్రి ఏడు గంటలకు వెళ్లి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వెళ్లాడు.
ప్రభుత్వాన్ని పీపీఏ తప్పుబట్టలేదు..
పీపీఏ ప్రభుత్వాన్ని ఎక్కడా తప్పుబట్టలేదు. అందులో ఆంధ్ర, తెలంగాణ, కేంద్రప్రభుత్వ అధికారులు ఉంటారు. పీపీఏలో కేవలం డిస్కషన్ మాత్రమే జరుగుతుంది. అధికారులను మేం మార్చడమేంటి..? చంద్రబాబు మార్చలేదా..? ట్రాన్స్ ట్రాయ్ నుంచి నవయుగకు నామినేషన్‌పై ప్రాజెక్టు కాంట్రాక్టు ఇచ్చారు. మేం అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ పిలిచి.. దానిద్వారా కాంట్రాక్ట్ ఇచ్చాం. డెడ్‌లైన్ చంద్రబాబే కదాపెట్టింది. మేం 2022లో పూర్తిచేస్తామని అన్నాం.. అప్పటికి డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయం గురించి మాకు తెలియదు. బాబు బుర్రలేని నిర్ణయంతో చేపట్టిన డయాఫ్రం వాల్ వరదల్లో కొట్టుకుపోవడంతోనే పోలవరం పనులు మందగించాయి.
ఖచ్చితంగా మా ప్రభుత్వమే పూర్తిచేస్తుంది
దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు ఇది. పకడ్బందీగా పూర్తిచేస్తాం. చంద్రబాబు తెలివితక్కువతనంతోనే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. ఆయనకు అన్నీ తెలుసనే ఈగోతో ఈరోజుకు తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. దీనిపై ఇంజినీరింగ్ నిపుణుల విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలనే చిత్తశుద్ధితో ప్రభుత్వం నడుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి గారే ప్రాజెక్టు పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి చంద్రబాబును కూడా పిలుస్తామనడంలో సందేహమేమీలేదు.