మీ అందం మీ చేతుల్లొో..బ్యూటీ మ్యాప్ ఆవిష్కరణ
బ్యూటీ కోసం డీఎన్ఏ ఆధారిత పరీక్ష
ఆవిష్కరించిన మ్యాప్ మై జీనోమ్
మ్యాప్ మై జీనోమ్ వారు చర్మ మరియు కేశ సంరక్షణకై “బ్యూటీ మ్యాప్” పేరుతో రూ.6999 ధరతో ప్రత్యేక DNA ఆధారిత పరీక్షను మార్కెట్ లో ప్రవేశపెట్టారు. మ్యాప్ మై జీనోమ్, భారత దేశంలో ప్రఖ్యాతి గడించిన జన్యు శాస్త్ర ఆధారిత వ్యాధి నివారణ పరీక్షలు అందించే సంస్థ. మ్యాప్ మై జీనోమ్ వారు వ్యక్తిగత చర్మ మరియు కేశ సంరక్షణకై ఉద్దేశించబడిన ప్రత్యేక DNA ఆధారిత నిర్థారణ పరీక్ష “బ్యూటీ మ్యాప్” ను అందుబాటులోనికి తీసుకొని వచ్చారు. ఏప్రిల్ 30 2023 నాటి నుండి అధికారికంగా భారతీయ మార్కెట్ లో అందుబాటులోనికి వచ్చే ఈ పరీక్షను రూ. 6999 లకు అందించనున్నారు.
“బ్యూటీ మ్యాప్” అనేది ప్రతి వ్యక్తి తన చర్మ మరియు కేశ సంరక్షణకు సంబంధించి పాటించే లేదా అవలంబించాల్సిన విధి విధానాలను పూర్తి స్థాయిలో నిర్థారించే లక్ష్యంతో ప్రవేశ పెట్టబడిన పరీక్ష. ఈ పరీక్షలో వ్యక్తి యొక్క DNA ను పూర్తి స్థాయిలో నిశితంగా విశ్లేషించి వారి వారి జన్యు నిర్మాణాన్ని ఆధారం చేసుకొని తద్వారా వ్యక్తుల చర్మ మరియు కేశ సంరక్షణకు సంబంధించిన సూచనలను ప్రత్యేకంగా అందించబడతాయి. ఈ పరీక్షలో వ్యక్తి యొక్క జన్యువులో చర్మ మరియు కేశాలకు సంబంధించి 40కి పైగా అంశాలను అనగా మొటిమలు, జుట్టు రాలి పోవడం, సూర్యూని వేడి కారణంగా చర్మం పాడు కావడం, పొడిబారి పోవడం, నిద్రపోయే అలవాట్లు మరియు విటమిన్ యొక్క స్థాయిలు లాంటి వాటిని పరీశీలించడం జరుగుతుంది.
ఇలా పలు అంశాలను పరిశీలించడంతో పాటు “బ్యూటీ మ్యాప్” పరీక్ష చేయించుకొన్న వారికి ప్రత్యేకంగా సర్టిఫై చేయబడిన జెనిటిక్ కౌన్సిలర్స్ ద్వారా ప్రత్యేకమైన జెనిటిక్ కౌన్సిలింగ్ అందించబడుతుంది. ఈ జెనిటిక్ కౌన్సిలర్స్ పరీక్షా ఫలితాలను విశ్లేషిస్తూ వాటిని పరీక్ష చేయించుకొన్న వారికి పూర్తి స్థాయిలో వివరించి తద్వారా వారి చర్మ మరియు కేశ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన విధి విధానాలను తెలియజేస్తారు.
ఇంతటి వినూత్నమైన పరీక్షను భారతీయ మార్కెట్ లో మొదటి సారి అందుబాటులోనికి తీసుకొని వస్తున్న సందర్భంగా శ్రీమతి అను ఆచార్య, CEO, మ్యాప్ మై జీనోమ్, మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తన DNA ఆధారంగా వారి వారి వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన నిర్ణయాలను పూర్తి అవగాహనతో తీసుకొనేందుకు వీలైన అవకాశాన్ని కలిపించడమే తమ సంస్థ లక్ష్యమని అన్నారు. ఇప్పటికే పలు జన్యు ఆధారిత పరీక్షలను అందిస్తున్న తమ సంస్థ ఇపుడు వ్యక్తిగత సౌందర్య సాధనకు అవసరమైన సూచనలను అందించే రీతిలో నూతన పరీక్షా విధానాన్ని అందుబాటులోనికి తీసుకొని వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. “బ్యూటీ మ్యాప్” పరీక్ష భవిష్యత్తులో సౌందర్య పరిరక్షణకు సంబంధించి విప్లవాత్మక మార్పులు తీసుకొని రాబోతుందని, ఇలాంటి వినూత్నమైన పరీక్షను భారతీయ మార్కెట్ లో మొట్ట మొదటి సారి అందుబాటులోనికి తీసుకొని రావడం పట్ల గర్వంగా ఉందన్నారు.
ఈ పరీక్షను శరీరానికి ఎలాంటి చిన్న పాటి కోత పెట్టడం లేదా గుచ్చడం లాంటివి చేయకుండా నోటిలోని లాలాజల నమూనాను సేకరించడం ద్వారా చేయబడుతుంది. అంతే కాకుండా మ్యాప్ మై జీనోమ్ వారి ప్రతి ఇంటా డి ఎన్ ఏ కార్యక్రమం క్రింద టెస్ట్ కిట్ ను అవసరమైన వారి ఇంటికే నేరుగా అందించి నమూనాలను సేకరించడం జరుగుతుంది.
ఇలా సేకరించబడిన నమూనా మ్యాప్ మై జీనోమ్ వారి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరీక్షా కేంద్రంలో విశ్లేషించబడుతుంది. తదనంతరం ఫలితాలను సామాన్యునికి కూడా అర్థమయ్యే రీతిలో ఆ వ్యక్తి చర్మ మరియు కేశ సంరక్షణకు సంబంధించిన సూచనలను రిపోర్టులో పొందుపర్చి ప్రత్యేకమైన జెనిటిక్ కౌన్సిలింగ్ కార్యక్రమం ద్వారా వివరించి అందించడం జరుగుతుంది.
ఇలాంటి విప్లవాత్మక పరీక్షను అందించడంపై అనూ ఆచార్య స్పందిస్తూ “సమాజంలోని ప్రతి వ్యక్తి తమ తమ చర్మ సంబంధిత రుగ్మతలను అధిగమించి, సౌందర్యం విషయంలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి తద్వారా మంచి అనుభూతి పొందేందుకు దోహదపడాలనుకుంటున్నాం. తాము అందిస్తున్న ఈ వినూత్నమైన పరీక్ష కారణంగా వ్యక్తిగత సౌందర్య సంరక్షణలోనే కాకుండా బ్యూటీ పరిశ్రమలో కూడా విప్లవాత్మక మార్పులు వస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు.”
ఈ పరీక్షను పొందాలనుకొనే వారు మ్యాప్ మై జీనోమ్ వెబ్ సైట్ ద్వారా లేదా మ్యాప్ మై జీనోమ్ వారి పార్టనర్స్ యొక్క వెబ్ సైట్స్ అనగా క్లినికల్లీ, అమెజాన్ లాంటి ఈ కామర్స్ పోర్టల్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.
దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం https://mapmygenome.in/beautymap/ ను సందర్శించండి.