ap news

“అడ్వాన్సుడు సాఫ్ట్ వేర్ టూల్స్ ఫర్ ఇ- పబ్లిషింగ్” పై శిక్షణ

నాగార్జున యూనివర్శిటీలో ఈనెల 29న శిక్షణ 

జర్నలిస్టులు పేర్లు నమోదు చేసుకోవాలని సూచన

“అడ్వాన్సుడు సాఫ్ట్ వేర్ టూల్స్ ఫర్ ఇ- పబ్లిషింగ్” కోర్సు పై ప్రత్యక్ష విధానంలో ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సి.ఆర్. మీడియ అకాడమీ ఛైర్మన్,శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లోని ప్రొ. బాలమోహనదాస్ సెమినార్ హాల్ లో ఈ శుక్రవారం (29. 12. 2023) ఉదయం 11. గంటల నుంచి ఈ శిక్షణను ఇవ్వనున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ,ఇంజనీరింగ్ కాలేజీ డీన్ డా. ఈ.శ్రీనివాసరెడ్డి, పై అంశాల పై ప్రత్యేక శిక్షణ ఇస్తారని ఆయన తెలిపారు.
ప్రచురణ(ప్రింట్ మీడియా ), ప్రసార (ఎలెక్ట్రానిక్/ డిజిటల్ మీడియా) రంగాల్లో ఆధునిక సాంకేతికత విధానాల పై వర్కింగ్ జర్నలిస్టులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యతను మీడియా అకాడమీ గుర్తించిందని శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మీడియా అకాడమీ సెప్టెంబర్ 23 వ తేదీ శనివారం ఆన్ లైన్ విధానం లో “మాధ్యమాల అవసరాలు – కృతిమ మేధ (AI)” అంశం పై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ,ఇంజనీరింగ్ కాలేజీ డీన్ డా. ఈ.శ్రీనివాసరెడ్డి ద్వారా ప్రత్యేక ప్రసంగం ఇప్పించామని ఆయన గుర్తు చేశారు. దాని కి వర్కింగ్ జర్నలిస్టుల నుంచి మంచి స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. దీనిపై ప్రత్యక శిక్షణా తరగతులు నిర్వహించాలని చాలా మంది వర్కింగ్ జర్నలిస్టులు, చిన్న పత్రికలు యాజమాన్యాలు కోరారన్నారు.
ఏమిటీ “ అడ్వాన్సుడు సాఫ్ట్ వేర్ టూల్స్”?
“చాట్ జి. పిటి” సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ఏ అంశం పైనైనా సమగ్ర సమాచారాన్ని వెంటనే పొందడం వీలవుతుంది.
“లెక్సికా ఆర్ట్ సాఫ్ట్ వేర్” ద్వారా మనం రాసే అంశానికి సంబంధించిన ఫోటోలు సులభంగా సేకరించే వీలుంది.
“సెంటేషియా” అనే సాఫ్ట్ వేర్ ను వినియోగించి ఒక వ్యక్తి పరోక్షంలో అదే వ్యక్తి ఇచ్చినట్లు ప్రసంగాన్నిదృశ్య శ్రవణ పద్దతిలో ప్రసారం చేయగలిగే వీలుంటుంది. (ఒరిస్సా రాష్ట్రం లో “బిగ్ టి.వి.”ఈ పద్దతి లో న్యూస్ ప్రెజెంటర్ లేకుండా వార్తలు చదివించి చరిత్ర సృష్టించింది)
“పారట్” అనే సాఫ్ట్ వేర్ వినియోగించి ఒక వ్యక్తి ప్రసంగాన్ని రికార్డుచేసిన దానికంటే స్పష్టత తో వినిపించడం వీలౌతుంది.
“హ్యూమ్ ” అనే సాఫ్ట్ వేర్ ను వినియోగించి ఫేక్ న్యూస్, ఫేక్ ఫోటోలను గుర్తు పట్టే వీలుంటుంది.
“అడ్వాన్సుడు సాఫ్ట్ వేర్ టూల్స్” వినియోగం వల్ల ప్రయోజనం.
50 కు పైగా ఇటువంటి సాఫ్ట్ వేర్ లు మనకు ప్రచురణ, ప్రసార రంగాల్లో అందుబాటులో వున్నాయ్. ఇటువంటి ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సు(కృత్రిమ మేధ) సాప్ట్ వేర్ టూల్స్ ద్వా రా చిన్న పత్రికలు, హౌస్ జర్నల్స్, డిజిటల్ మీడియా సైట్లను ఖచ్చితత్వం తో సులువుగ నిర్వహించుకునే వీలుంది. ఇవన్నీ చిన్న పత్రికల నిర్వాహకులకు, డిజిటల్ మీడియా నిర్వాహకులకు నిర్వహణా వ్యయాన్ని, సమయాన్ని ఆదా చేస్తాయి.
28.12.2023 సాయంత్రం లోపున ముందుగా పేర్లను నమోదు చేసుకోవాలి.
ప్రత్యక్ష శిక్షణ లో పాల్గొనాలనుకునే వర్కింగ్ జర్నలిస్టులు, చిన్న పత్రికల, డిజిటల్ యాజమాన్యాల ప్రతినిధులు తగు ఏర్పాట్లు చేయడానికి తమ పేర్లను, తాము పనిచేస్తోన్న సంస్థ పేరును 28.12.23 తేదీ లోపున వాట్స్ అప్ ద్వారా 9154104393 నెంబర్ కు నమోదు చేసుకోవాల్సిందిగా చైర్మన్ విజ్ఞప్తి చేశారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *