విజ్ఞాన్స్ అధ్యాపకుడికి పీహెచ్‌డీ
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలోని ఈఈఈ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పమిడి లక్ష్మినారాయణకు తమ యూనివర్సిటీ ఈఈఈ విభాగంలో పీహె^Œ డీ పట్టా అందజేసిందని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మంగళవారం తెలిపారు. ఈయన ‘‘ఫేసర్ మెజర్‌మెంట్ యూనిట్ ప్లేస్‌మెంట్ విత్ కంప్లీట్ అబ్జర్వబిలిటీ ఫర్ డైనమిక్ స్టేట్ ఎస్టిమేషన్ ఇన్ పవర్ సిస్టమ్’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేసారు. ఈయనకు విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని ఈఈఈ డిపార్ట్‌మెంట్‌లోని ప్రొఫెసర్ మెర్సి రోసలీనా గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం ఎస్‌సీఐ–1, స్కోపస్ జర్నల్స్–3, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లు 2 ప్రచురించారని వెల్లడించారు. పీహెచ్‌డీ పట్టాపొందిన పమిడి లక్ష్మినారాయణను విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్ ప్రొఫెసర్ పీ.నాగభూషన్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.