gunturu

నేనే వచ్చా.. కేసు నమోదు చేయండి ..

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గళ్ళా మాధవి సంచలనం 

పోలీస్ వర్గాల్లో కలకలం 

బాధితురాలితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే 

“అక్కా… నన్ను కాపాడండి. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నా భర్త మద్యం తాగి తరచూ వేధిస్తున్నాడు. కత్తి పట్టుకుని బెదిరిస్తున్నాడు. మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు…” అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రిజ్వానా అనే మహిళ కన్నీటి పర్యంతమై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే  గళ్ళా మాధవి కలిసి తన గోడును వినిపించుకుంది. ఇప్పటికే తన భర్తపై పోక్సో కేసు నమోదై ఉన్నప్పటికీ, వేధింపులు మాత్రం ఆగడం లేదని, తనకూ, తన పిల్లలకు రక్షణ కల్పించాలని ఆమె వేడుకున్నారు.

బాధితురాలి ఆవేదనను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి వెంటనే స్పందించారు. ఈ నెల 17వ తేదీన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే “ఎవరినైనా తీసుకొని వస్తే, కేసు నమోదు చేస్తామని” చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి దృష్టికి తీసుకొచ్చారు.సాధారణంగా ఒక ప్రజాప్రతినిధి ఫోన్ చేసి అధికారులతో మాట్లాడవచ్చు. సూచనలు ఇవ్వవచ్చు. కానీ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాత్రం అక్కడితో ఆగలేదు.

బాధితురాలి పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెను స్వయంగా తన వాహనంలో తీసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ పోలీస్ అధికారులతో నేరుగా మాట్లాడుతూ… ఎవరో వస్తే గాని కేసు నమోదు చేయను అని చెప్పారు అంటా, బాధితురాలి తరపున నేనే వచ్చా కేసు నమోదు చేయండి అని పోలీసుల ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరడంతో పోలీసులు నిర్ఘాంత పోయారు. బాధితురాలికి న్యాయం జరిగేలా, భద్రత కల్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. గృహహింస, వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొంటున్న మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన బాధ్యత అని, బాధలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలబడటమే ప్రజాప్రతినిధిగా తన కర్తవ్యమని మాధవి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *