విమర్శ అవసరమే…నింద పనికిరాదు
గ్రంధావిష్కారణ …
సాహితి పురస్కార ప్రదాన సభలో డాక్టర్ వృషాదిపతి..
ఏ అంశంలో అయినా, ఏ పనిలో అయినా సున్నిత విమర్శ అత్యవసరం .. దీని వల్ల భవిష్యత్ లో సరిదిద్దుకునే అవకాశం కలుగుతుంది .. అయితే పనిగట్టుకుని నిందించడం సరికాదని ప్రముఖ సాహితివేత్త డాక్టర్ మొవ్వా వృషాదిపతి అన్నారు ..ఎపిఎస్ ఆర్టిసి ఎం.డి సి హెచ్ ద్వారకా తిరుమలరావు సహోదరి రచయిత్రి డాక్టర్ సి హెచ్ సుశిలమ్మ రచించిన “విమర్సనాలోకనం “ గ్రంధావిస్కరణ సభ శుక్రవారం సాయంత్రం గుంటూరు బృందావనగార్దేన్స్ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయం ప్రాంగణంలో ఘనంగా జరిగింది . ఈ సందర్బంలో ద్వారకతిరుమలరావు తండ్రి గారు సి హెచ్ లక్ష్మినారాయణ పేరిట ఏర్పాటైన స్మారక సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితి విమర్శకులు ఆచార్య రాచెపాలెం చంద్రశేఖరరెడ్డికి అందచేసారు .డాక్టర్ సి హెచ్ ప్రసూనంబ ,డాక్టర్ కే.కిశోర్ ప్రసాద్ లకు గ్రంధాన్ని అంకితం చేసారు .
ఈ సభలో అజో … విభో…కందాళం ఫౌండేషన్ నిర్వాహకులు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారయణ , ప్రముఖ రచయిత వల్లూరు శివప్రసాద్ ఎక్షైస్ శాఖ డిప్యూటీ కమీషనర్ జి .కోటేశ్వరరావు ,కళారత్న డాక్టర్ భూసురపల్లి వెంకటేస్వర్లు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఓరుగంటి వెంకటరమణ గారు మరియు తదితరులు పాల్గొన్నారు