Literature

విలక్షణ సాహితీ వేత్త సాగర్

ఒంగోలులో ‘అవస్థ’ నవల ఆవిష్కరణ 

జానుడి ఆధ్వర్యంలో సాగర్ రచనలపై సదస్సు

కవిగా, రచయితగా, సాహిత్య విమర్శకుడిగా శ్రీ రామకవచం సాగర్ వినూత్నమైన శైలితో విలక్షణ సాహితీ వేత్తగా ఆధునిక సాహిత్యచరిత్రలో నిలిచిపోయారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఒంగోలు శ్రీనగర్ కాలనీలోని డాక్టర్ మల్లవరపు రాజేశ్వరరావు భవన్లో  ఆదివారం జానుడి-సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సాగర్ సాహిత్య సమాలోచన సదస్సు ఆదివారం జరిగింది. సదస్సు సంచాలకుడిగా జానుడి డైరెక్టర్ డాక్టర్ నూకతోటి రవి కుమార్ వ్యవహరించగా, సాగర్ కవిత్వం, నవల,సాహిత్య విమర్శ సదస్సులకి సాహిత్యవేత్తలు మంచికంటి వెంకటేశ్వర రెడ్డి, మల్లవరపు ప్రభాకరరావు, చిన్ని నారాయణరావు లు వ్యవహరించారు. ఈ సదస్సులో సాగర్ రచించిన నూతన నవల ‘అవస్థ’ను తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు, ప్రముఖ కవి నాగేశ్వరం శంకరం ఆవిష్కరించగా ప్రముఖ కథా రచయిత కాట్రగడ్డదయానంద్ సమీక్ష చేశారు.

శ్రీరామకవచ సాగర్
కవి, నవలా రచయిత

సాగర్ కవిత్వంపై ప్రముఖ కవులు ఎజ్రా శాస్త్రి, కందిమళ్ల శివప్రసాద్, నవలలపై కథారచయితలు మన్నెం సింధు మాధురి, ఎం హనుమంతరావు, బి ఎస్ ఎన్ కుమార్ లు ప్రసంగించారు.సాగర్ రచించిన సాహిత్య విమర్శ వ్యాసాలు ‘ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు’ పుస్తకంపై ప్రముఖ రచయిత వెన్నెల కంటి రామారావు విశేష ప్రసంగం చేశారు.ఈ సాహిత్య సదస్సులోసాహిత్యకారులు కె.వి.రమణారెడ్డిలతో పాటు , డాక్టర్ యూ.దేవ పాలన, తేళ్ల అరుణ, పొన్నూరి వెంకట శ్రీనివాసులు, ఈ ఎస్. బ్రహ్మచారి, గోగుమళ్ల శిరీష, డాక్టర్ దిలీప్, బొగ్గరపు రాధాకృష్ణ ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు, గోవిందరాజుల సుభద్రాదేవి, డాక్టర్ సుధాకర్, గాడేపల్లి దివాకర్ దత్తు, దేవ ప్రసాద్, నన్నపనేని రవి, పాలూరు శివప్రసాద్, పలువురు రచయితలు కవులు పాల్గొన్నారు.

సభలొ మాట్లాడుతున్న మల్లవరపు ప్రభాకరరావు
సభలో మాట్లాడుతున్న ప్రముఖ కవి, రచయిత టి.అరుణ
సభలో మాట్లాడుతున్న మన్నెం సింధుమాధురి
సభలో మాట్లాడుతున్న వెన్నెలకంటి రామారావు

 

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *