‘అమరజీవి బలిదానం’ ఆవిష్కరణ
రచయిత నాగసూరికి సన్మానం
పొట్టి శ్రీరాములు సేవలు ఎవరు మర్చిపోలేరని నెల్లూరులోని డీ.కే ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గిరిధర్ అన్నారు. గురువారం ప్రముఖ పాత్రికేయుడు, రచయిత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ రచించిన అమరజీవి బలిదానం అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు .ఈ సందర్భంగా గిరిధర్ మాట్లాడుతూ ఆవరణ నిరాహార దీక్ష చేసి తెలుగువారి కోసం ప్రాణాలు వదిలిన అమరజీవి పొట్టి శ్రీరాములు ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలనీ, ఆయనందించిన స్ఫూర్తితో నడవాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందచేశారు. రచయిత నాగసూరి వేణుగోపాల్ ఘనంగా సత్కరించారు .ఈ కార్యక్రమంలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్, స్వతంత్ర సమరయోధులు కేవీ చలమయ్య, సాహిత్య వేత్త టేకుమళ్ళ వెంకటప్పయ్య, నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాతూరి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.