ప్రజాస్వామిక స్పృహను పెంచేదే సాహిత్యం
ఒంగోలులో ‘అగ్నిగోళాలు’ పుస్తక పరిచయ సభ
ఒంగోలు, జూన్ 13 : ప్రజాస్వామిక స్పృహను పెంచేదే సాహిత్యమని జానుడి- సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ నూకతోటి రవికుమార్ పేర్కొన్నారు.రచయిత విశ్రాంత రైల్వే ఉద్యోగి వేల్పూరి కామేశ్వరరావు రచించిన ‘అగ్ని గోళాలు’ పుస్తక పరిచయ సభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ రవికుమార్ ప్రసంగిస్తూ జెన్నీ మార్క్స్ తో మాతా రమాబాయి అంబేద్కర్ ని పోల్చడం బాగుందని అన్నారు. పుస్తకాన్ని ప్రముఖ సాహిత్య వేత్త శ్రీ రామ కవచం సాగర్ ఆవిష్కరణ చేసి ప్రసంగించారు. సభలో బహుజన రచయితల వేదిక కన్వీనర్ మిరియం అంజిబాబు, రంగభూమి కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్, అంబేద్కర్ సేవా సంస్థ అధ్యక్షుడు జాలాది మోహన్, విద్యావంతుల వేదిక ప్రతినిధులు దారా మోహన్, శ్రీనివాసరావు, వివిధ సాహిత్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.