అరుదైన సాహిత్య విమర్శకుడు ఆచార్య కేకేఆర్

జానుడి ఆధ్వర్యంలో ఆచార్య కేకేఆర్ కు ఘన నివాళి
ఒంగోలు, మే 15 :  తెలుగు సాహిత్యం చారిత్రక భూమిక, తెలుగులో తొలి సమాజ కవులు తదితర పుస్తకాల రచనతో ఆధునిక తెలుగు సాహిత్యానికి విలువైన ప్రాతిపదిక వేసిన గొప్ప సాహిత్య విమర్శకుడు ఆచార్య కేకే. రంగనాథచార్యులు అని జానుడి- సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు ప్రొఫెసర్ కేకే రంగనాథచార్యుల వర్ధంతి సభ సోమవారం ఈ మేరకు ఒంగోలు సిపిఐ ఆఫీసులో నిర్వహించారు. ఆచార్య కేకే రంగనాథ చార్యులు ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రాచ్య కళాశాల అధ్యాపకులుగా, ప్రధాన అధ్యాపకులుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులుగా పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారని ఆయన అన్నారు. చారిత్రక దృక్పథంతో తెలుగు సాహిత్య అధ్యయన మార్గానికి దారులు వేసిన కేకేఆర్ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకులలో అరుదైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ బచావో ఆందోళన్ ప్రతినిధి మాచర్ల మోహనరావు, ఓపిడిఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావలి సుధాకర్, బహుజన రచయితల వేదిక జిల్లా కన్వీనర్ మిరియం అంజిబాబు, చప్పిడి కోటేశ్వరరావు, ప్రజానాట్యమండలి ప్రతినిధి రామకృష్ణ, ఏపీటీఎఫ్ ప్రతినిధి సుబ్బారావు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని ఆచార్య కేకేఆర్ కు నివాళులర్పించారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *