Medical and Health

జిజిహెచ్ లో వంద మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు

అన్ని ఆపరేషపన్లు విజయవంతం 

డాక్టర్ బూసి రెడ్డి నరేందర్ రెడ్డి ఘనత

అభినందనలతో ముంచెత్తిన వైద్యులు

గుంటూరు సర్వ జన ఆసుపత్రి (జీజీహెచ్) లో పేద రోగులకు ఉచితంగా వంద మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడం అరుదైన ఘట్టమని జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అన్నారు. జిజిహెచ్ లో సోమవారం ఆర్ధోపెడిక్ సెమినార్ హాలులో వంద మోకీలు మార్పిడి శస్త్ర చికిత్స లు విజయవంతం గా పూర్తి చేయడంపై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు జిజిహెచ్ లో వంద మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడం గర్వంగా భావిస్తున్నానని అన్నారు. కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులను పూర్తిగా ఆర్ధోపెడిక్ విభాగం వినియోగించుకుంది. కరోన ముందు 80, ఆ తర్వాత 20 శస్త్ర చికిత్సలు చేసి జిజిహెచ్ ప్రతిష్ఠ ను మరింతగా పెంచారు.ఉన్నతి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి ఈ శస్త్ర చికిత్సలో భాగస్వామ్యం కావడం అభినందనీయమని ఆమె అన్నారు. శస్త్ర చికిత్సల కోసం 15 లక్షల ఖరీదు చేసే ఇంప్లాంట్స్ ఇవ్వడం మానవత్వానికి నిదర్శనమని ఆమె కొనియాడారు.

సహజంగా కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తే సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉండేవి. కానీ ఈ ఆసుపత్రిలో వంద మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేసినా ఏ సమస్య రాకపోవడానికి కారణం వైద్యుల పనితీరుకు నిదర్శనమని ఆమె చెప్పారు. ఆర్ధో విభాగం అధిపతి డాక్టర్ గంటా వర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్య కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ఏడాది డిసెంబర్ రెండో తేదీన వై యస్ ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆసరా కింద ఎముకలు కీళ్ల వ్యాధితో బాధ పడేవారికి ఆర్ధిక సహాయం చేస్తోంది.జిజిహెచ్ లో ఇటీవల ఒకేరోజు 10 మోకాలు మార్పిడి చికిత్సలు చేసి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నామని ఆయన గుర్తు చేశారు. ఈ శస్త్ర చికిత్సల కోసం ఉన్నతి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి అందించిన సహకారాన్ని మరువ లేమని ఆయన చెప్పారు. డాక్టర్ బి ఎన్ రెడ్డి గొప్ప మానవత్వ వాదియని 15 లక్షల విలువ చేసే ఇంప్లాంట్స్ ఇవ్వడం అందుకు తార్కాణమని ఆయన అన్నారు.

ఈ శస్త్ర చికిత్సల వల్ల రోగులకు ఎలాంటి సమస్యలు ఇప్పటివరకు రాలేదు. మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో విజయ వంతంగా చేశామని ఆయన తెలిపారు. ఉన్నతి ఫౌండేషన్ చైర్మన్ , ప్రముఖ మోకాలు మార్పిడి వైద్యులు, డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ జిజిహెచ్ లో మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగే విధంగా కృషి చేస్తామని చెప్పారు. రాయలసీమ లో బర్డ్స్ ఉన్న మాదిరిగా గుంటూరు జిజిహెచ్ లో కూడా అదే స్థాయిలో మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని దీనివల్ల కోనసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి ఈ ప్రొజెక్టు గురించి వివరిస్తానని ఆయన అన్నారు.
ఈ ఆసుపత్రిలో వంద మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతం గా చేయడం లో జిజిహెచ్ వైద్యులు ఎంతో కృషి చేసారు. ఏ సమయంలో నైనా పిలిస్తే తప్పకుండా హాజరై సేవలు అందిస్తానని ఆయన చెప్పారు.

జిజిహెచ్ వైద్యులు చూపించిన అభిమానానికి ఎన్నడూ మరువలేనని ఆయన అన్నారు..అనంతరం జిజిహెచ్ వైద్యులు డాక్టర్ బి ఎన్ రెడ్డి ని శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలు పొందిన పి చిన్నప్ప, బి వెంకట రమణ, పులియ నాయక్ మాట్లాడుతూ మోకాలు నొప్పి వల్ల కనీసం పది అడుగులు వెయ్యడం కష్టంగా ఉండేది. నొప్పి తీవ్రత వల్ల కూర్చోలేక పోయాం. ఈ బాధలు తట్టుకోలేక జిజిహెచ్ కు రావడం జరిగింది. ఇక్కడి వైద్యులు మోకాలు మార్పిడి శస్త్ర చికిత్స చేసిన తర్వాత హాయిగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నారాయణ రావు, డాక్టర్ యస్ యస్ వి రమణ, డాక్టర్ యం భీమేశ్వర రావు, డాక్టర్ పొలుగు కిరణ్, డాక్టర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *