ఉచితంగా బూస్టరు డోసు

ఈనెల 15 నుంచి పంపిణీ
కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
కరోనా వైరస్..మరోసారి దేశ ప్రజలను భయకంపితుల్ని చేస్తోంది. రోజురోజుకు కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు డబ్బులు చెల్లించి తీసుకునేందుకు అందుబాటులో ఉన్న బూస్టరు వ్యాక్సిన్ డోసును ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈనెల 15 నుంచి 18 నుంచి 59 ఏళ్ల వారికి మూడవ డోసుగా చెప్పే బూస్టరు డోసును ఉచితంగా ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాల్సింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం పంపించింది. దేశంలో రెండో డోసు తీసుకున్న కాల పరిమితి కనిష్టంగా 9 నెలలు ఉంది..ఆరు నెలలకే యాంటీబాడీలు తగ్గిపోతున్ననేపథ్యంలో బూస్టరు డోసు తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)తో పాటు అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు స్పష్టం చేయటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రెండో డోసు తీసుకున్న తరువాత బూస్టరు డోసు తీసుకునేందుకు కనిష్ట కాలపరిమితి 9 నెలలు ఉండగా ఇపుడా పరిమితిని 6 నెలలకు తగ్గించారు. అధికారిక సమాచారం ప్రకారం దేశ జనాభాలో 96 శాతం ఒకటో డోసు, 87 శాతం మంది రెండు డోసులు, మూడు డోసులు తీసుకున్న వారి సంఖ్య అత్యల్పంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published.