జాతీయ సరస్ మేళాలో వైద్య శిబిరాలు

ఐసీయూ యూనిట్‌ను పరిశీలించిన ఉన్నతాధికారులు

విజయవాడలోని  జాతీయ సరస్ మేళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను, ఐసీయూ యూనిట్‌ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ వెంకటరమణ, ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ. శ్రావణ బాబు, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ మాధవి దేవి సందర్శించి పరిశీలించారు. మేళాకు విచ్చేసే ప్రజలు, సందర్శకులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లను సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సహాయం అందించేలా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, మందులు మరియు వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు.

వైద్య పరికరాలు పరిశీలిస్తున్న అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *