జనార్దన్ కు శుభాకాంక్షలు
ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పుట్టిన రోజు సందర్భంగా ఒంగోలు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ నగర అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం ఆయన నివాసానికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛంతో పాటు శాలువా కప్పి సత్కరించారు. జనార్దన్ ను కలిసిన వారిలో కమిటీ ప్రధాన కార్యదర్శి వేమూరి సుబ్బారావు, ఉపాధ్యక్షుడు కొల్లా మధు, కోశాధికారి ఏడుకొండలు, జాయింట్ సెక్రటరీ వేమూరి మధుసుధన్ తదితరులు ఉన్నారు.