కొత్త జిల్లాలకు మహిళల పేర్లు పెట్టాలి

నరసం గౌరవాధ్యక్షురాలు టి.అరుణ
ప్లానింగ్ కమిషన్ కార్యదర్శికి వినతిపత్రం

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలకు మహిళల పేర్లు కూడా పెట్టాలని నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (నరసం )గౌరవాధ్యక్షురాలు టి.అరుణ, కోశాధికారి బీరం అరుణలు కోరారు. ఈ మేరకు విజయవాడలోని ప్లానింగ్ కమిషన్ కార్యదర్శి విజయ్ కుమార్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మహిళల పేర్లు పెట్టాల్సిన ప్రాధాన్యతను విజయకుమార్ కు అరుణ వివరించారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సర్వం కోల్పోయి చివరకు ప్రాణాలకు త్యజించిన ఎందరో మహిళా మూర్తులు ఏపీలో ఉన్నారనీ, కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా వారిని సైతం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. దీనిపై విజయకుమార్ సానుకూలంగా స్పందించారనీ, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తానని తెలిపినట్టు అరుణ వెల్లడించారు.

 

Leave a Reply

Your email address will not be published.