Prakasam

ప్రణవి ‘గురి’.. బుల్లెట్ దిగాల్సిందే..

  • ఎయిర్ గన్ షూటింగ్ లో తిరుగులేని ప్రణవి
  • మూడు బంగారు పతకాలు కైవసం

ఎయిర్ గన్ షూటింగ్ ద్వారం ప్రణవి దూసుకుపోతోంది. జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక మెడల్స్ సాధించిన ప్రణవి జూన్ 17 నుండి 23వరకు హైదరాబాద్, గచ్చిబౌలి లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో తాజాగా 10 మీటర్లు, 25 మీటర్ల విభాగం లో మూడు గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్, ఒక బ్రాంజ్ మెడల్ సాధించి ప్రదమ స్థానంలో నిలిచింది. ఈనెల 9న విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్ లో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ షూటింగ్ అసోషియేషన్ ప్రెసిడెంట్ సలాలిథ్ తొట్టెంపూడి ప్రణవికి బహుమతి ప్రదానం చేశారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం, రంగాయపాలెం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు ద్వారం జాలిరెడ్డి కూతురు ప్రణవి గతంలో చెన్నై, బెంగుళూర్, హైదరాబాద్ లలో నిర్వహించిన పోటీల్లోనూ ప్రతిభా పాటవాలు ప్రదర్శించి బహుమతులు అందుకున్నారు.

ద్వారం ప్రణవి
Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *