ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు పుస్తకాల పంపిణీ
- డాక్టర్ చాపల వంశీ కృష్ణ సహకారం
- ఒంగోలు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ – కొత్తపట్నం శ్రీవాణి విద్యానికేతన్ ఆధ్వర్యంలో కొత్తపట్నం మండలం పల్లెపాలెం గ్రామంలోని మూడు ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల విద్యార్థులందరికీ శుక్రవారం ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యా సంవత్సరానికి సరిపడా మూడు వేల నోటు పుస్తకాలను విద్యార్ధులకు ఉచితంగా అందచేశారు. విద్యార్ధుల్లో స్ఫూర్తి నింపేందుకు గత ఏడాది చదువులో ప్రతిభ కనబర్చిన విద్యార్ధుల ఫొటోలను నోటు పుస్తకాలపై ముద్రించారు.
- “అందరూ చదవాలి – అందరూ ఎదగాలి” అనే నినాదంతో శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, ప్రముఖ వైద్యులు డాక్టర్ చాపల వంశీకృష్ణ సొంత గ్రామమైన పల్లెపాలెంలో విద్యాభివృద్ధి కోసం 2015 నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణతో పాటు ముఖ్య అతిధిగా జిల్లా విద్యాశాఖ అధికారి, రీజనల్ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు హాజరయ్యారు.