గళ్ళా మాధవి శ్రీశైలం యాత్ర

ఆధ్యాత్మిక శోభతో టీడీపీ శ్రేణుల పరవశం
బోర్డు సభ్యుడు బోడేపూడి వెంకట సుబ్బారావు సంపూర్ణ సహకారం
స్వాగతం, వసతి, దర్శన ఏర్పాట్లన్నీ దగ్గరుండి పర్యవేక్షణ
ప్రత్యేక పూజలో పాల్గొన్న గళ్ళా మాధవి దంపతులు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి దంపతుల శ్రీశైలం యాత్ర ఆద్యంతం ఆధ్మాత్మిక శోభతో అలరించింది. సుమారు 450 మంది టీడీపీ కార్యకర్తలతో శ్రీశైలం క్షేత్రానికి చేరుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. నిత్యం రాజకీయాల్లో, ప్రజా జీవితంలో తలమునకలైన ఉండే టీడీపీ శ్రేణులు గళ్ళా మాధవి దంపతులతో కలిసి ఆధ్యాత్మిక లోకంలో విహరించి స్వాంతన చెందారు. శివనామ స్మరణతో పరవశులయ్యారు.

బోడెపూడి వెంకట సుబ్బారావు ఘన స్వాగతం
ఎమ్మెల్యే గళ్ళా మాధవి రామచంద్రరావు దంపతులకు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు శ్రీశైలం దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యుడు బోడెపూడి వెంకట సుబ్బారావుసాదర స్వాగతం పలికారు. అనంతరం దేవస్థానం అధికారులతో సమన్వయం చేసుకుని ఎమ్మెల్యే దంపతులతో పాటు సుమారు 450 మంది కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. క్యూలైన్లు, ఇతర ఆలయ సంబంధిత ఏర్పాట్లను పరిశీలించి వారికి ప్రోటోకాల్ దర్శనం కల్పించారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. ఎలాంటి అసౌకర్యం కలకుండా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన బోడేపూడిని గళ్ళా మాధవి దంపతులతో పాటు టీడీపీ కార్యకర్తలు ప్రశంసించారు.

కార్యకర్తల కృషికి గుర్తింపు
పార్టీ పిలుపునందుకుని ఇంటింటికీ కార్యక్రమంలో ముందుండి పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గుర్తించి, వారికి ప్రత్యేకంగా పర్యటన ఏర్పాటు చేయడం అభినందనీయమని శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ బోడెపూడి వెంకట సుబ్బారావు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పూర్తి చేసిన రాయలసీమ, ప్రకాశం జిల్లాల ప్రజల కలల వారధి వెలుగొండ ప్రాజెక్టును కార్యకర్తలకు స్వయంగా చూపించడంతోపాటు, అనంతరం శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి తీసుకురావడం వినూత్న కార్యక్రమమని పేర్కొన్నారు.కార్యకర్తల కృషిని గుర్తించి వారికి ఇలాంటి అవకాశాలు కల్పించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత స్ఫూర్తి, ఉత్సాహం కలుగుతుందని బోడెపూడి వెంకట సుబ్బారావు అభిప్రాయపడ్డారు.
