ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుతో పేదలకు పెను ముప్పు

తమిళనాడు డీఎంకే ఎంపీ పి.విల్సన్
FCRA బిల్లుపై నిరసన సభ,
కేంద్రంపై ఒత్తిడికి రంగం సిద్ధం,
ఉద్యమానికి స్వచ్చంద సంస్థలు,
NASCO ఆధ్వర్యంలో సదస్సు
కేంద్రం తీరు పై మండిపడ్డ ప్రతినిధులు
విజయవాడ : ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) బిల్లుపై 2026 మార్చి 25న తీసుకొచ్చిన సవరణలపై డీఎంకే ఎంపీ పి. విల్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ అలియన్స్ అఫ్ సివిల్ సొసైటీస్ ఆర్గనైజషన్ ( NACSO) ఆధ్వర్యంలో విజయవాడ MB భవన్ లో శనివారం నిర్వహించిన సమాలోచన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రధానంగా, ఒక సంస్థకు ఉన్న ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) రిజిస్ట్రేషన్/సర్టిఫికెట్ రద్దయితే, ఆ సంస్థకు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లేలా ఈ సవరణ బిల్లు నిబంధనలు ఉండటం అభ్యంతరకమన్నారు. ఆస్తులను పబ్లిక్ వేలం ద్వారా విక్రయించడంతో పాటు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంలోని ఏదైనా విభాగానికి బదిలీ చేసే అవకాశాన్ని కూడా ఈ బిల్లులో పొందుపర్చారని తెలిపారు. ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను సకాలంలో పునరుద్ధరించకపోయినా లేదా సర్టిఫికెట్ రద్దయినా ఆస్తులు ప్రభుత్వ ఆదీనంలోకి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఒక్క చిన్న ఉల్లంఘనకు మొత్తం ఆస్తులపై చర్య ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు.ఒక సంస్థకు సంబంధించి ఏదైనా చిన్న ఉల్లంఘన జరిగిందని భావించినా, ఒకే ఒక్క లావాదేవీలో నిబంధనల ఉల్లంఘన జరిగిందనే కారణంతో మొత్తం ఎఫ్‌సీఆర్‌ఏ సర్టిఫికెట్‌ను ఎలా రద్దు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా, అంటే 50–60 సంవత్సరాలుగా సంస్థలు చట్టబద్ధంగా సంపాదించుకున్న ఆస్తులు ఒక చిన్న ఉల్లంఘన కారణంగా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లే పరిస్థితి రావడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
సేవా కార్యక్రమాల పరిస్థితి ఏమిటి..?
విదేశాల నుంచి వచ్చిన నిధులతో ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, కళాశాలలు, అనాథాశ్రమాలు వంటి ప్రజా సేవా సంస్థలు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న సంస్థల పరిస్థితి ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయా సంస్థలు నిర్వహిస్తున్న కార్యకలాపాలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం బిల్లులో ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆసుపత్రులు, పాఠశాలలు, వృద్ధాశ్రమాల పరిస్థితి ఏమిటి అని అన్నారు.

ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. కొరివి వినయకుమార్
సభాధ్యక్షుడు DBF వ్యవస్థాపకుడు కొరివి వినయ కుమార్ మాట్లాడుతూ జాయింట్ యాక్షన్ ఫోరం ద్వారా
దేశ వ్యాప్తంగా ప్రతినిధులతో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. బాధితులందరిని క్రోడికరించి కేంద్ర ప్రభుత్వం ఈ సవరణలను వెనక్కి తీసుకునేలా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన ఆదికిరణ్ మాట్లాడుతూ ఈ సవరణల వల్ల అనేక వృద్ధాశ్రమాలు, విద్యాలయాలు మూత పడతాయని అన్నారు. దీనివల్ల పేదలకు ముఖ్యంగా క్రైస్తవ సంస్థలకు పెద్ద ముప్పు ఉంది అని తెలిపారు.
సవరణలను వెనక్కి తీసుకెళ్లాటానికి భవిష్యత్ ప్రణాళికను తీర్మానించిన ఈ కార్యక్రమంలో అంబటి రామకృష్ణ అంగడాల పూర్ణచంద్రరావు, సామ్యూల్, ప్రతాప్ సిన్హా, టి.విజయ్ కుమార్, మేళం భాగ్యరావు
పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు
