ap news

వైజాగ్ హోటళ్ళు, రెస్టారెంట్లలో తనిఖీలు

అపరిశుభ్ర వాతావరణం .. నిబంధనలకు విరుద్ధంగా చికెన్ నిల్వలు
కామత్‌ హోటల్‌ లో సుమారు 60 కిలోల చికెన్‌ ధ్వంసం
పిస్తా హోటల్ లో సుమారు 30 కిలోల చికెన్‌ ధ్వంసం
వంట గదులు సీజ్
ఆల్ఫా, ఫ్యూజన్‌ ఫుడ్స్‌, ఈస్టర్న్‌ స్పైస్‌ రెస్టారెంట్లలోనూ నిర్వహణాలోపాలు
డ్రగ్స్‌ అండ్‌ ఫుడ్‌ సేఫ్టీ విభాగం డైరెక్టర్‌ పి.అరుణబాబు ఆధ్వర్యంలో తనిఖీలు

హోటళ్ళలో అపరిశుభ్ర వాతావరణ

విశాఖపట్నంలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో డ్రగ్స్‌ అండ్‌ ఫుడ్‌ సేఫ్టీ విభాగం డైరెక్టర్‌ పి.అరుణబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాడుమాడుతూ అనేక నిర్వహణా లోపాలు బయపడ్డాయి. గురువారం రాత్రి పొద్దుపోయేంత చేసిన తనిఖీల్లో వైజాగ్ బీచ్ రోడ్ లోని
కామత్‌ హోటల్‌ లో సుమారు 60 కిలోల చికెన్‌ నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. వెంటనే ఆ మాంసాన్ని ధ్వంసం చేశారు. అపరిశుభ్ర పరిస్థితులు బయటపడటంతో వంటగదిని సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు.

డ్రగ్స్‌ అండ్‌ ఫుడ్‌ సేఫ్టీ విభాగం డైరెక్టర్‌ పి.అరుణబాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న దృశ్యం

పిస్తా హౌస్‌, బీచ్‌ రోడ్‌:  సుమారు 30 కిలోల చికెన్‌ను అధికారులు ధ్వంసం చేశారు. నిబంధనలు పాటించనందుకు మెరుగుదల నోటీసు జారీ చేసి కేసు నమోదు చేశారు.

ఆల్ఫా హోటల్‌, జగదాంబ సెంటర్‌: వంటగదిలో అపరిశుభ్ర పరిస్థితులు గుర్తించడంతో నోటీసు జారీ చేసి వంటగదిని సీజ్‌ చేశారు.

డ్రగ్స్‌ అండ్‌ ఫుడ్‌ సేఫ్టీ విభాగం డైరెక్టర్‌ పి.అరుణబాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న దృశ్యం

ఫ్యూజన్‌ ఫుడ్స్‌, సిరిపురం:  వంటగదిలో అపరిశుభ్రతను గుర్తించి నోటీసు జారీ చేసి సీజ్‌ చేశారు.

ఈస్టర్న్‌ స్పైస్‌ రెస్టారెంట్‌, అక్కయ్యపాలెం:  వంటగదిలో పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడంతో మెరుగుదల నోటీసు జారీ చేసి కేసు నమోదు చేశారు.

తనిఖీ బృందంలో బి. శ్రీనివాస్‌, జాయింట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌; కల్యాణ్‌ చక్రవర్తి, వేణుగోపాలరావు, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్లు; రవికుమార్‌, అప్పారావు, రవీంద్రరెడ్డి, శ్రీను, ఆనందరావు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *