ap news

జనసేన స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ

అయిదుగురు సభ్యులతో కమిటీని ప్రకటించిన పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ శ్రేణుల నుండి సమాచారాన్ని సేకరించేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమన్వయ కమిటీని నియమించారు. కమిటీలో ఈ కమిటీలో ఏపీఎంఎస్ ఐడిసి చిల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు, విశాఖపట్నం దక్షిణ శాసనసభ్యుడు వంశీకృష్ణ యాదవ్, భీమవరం నియోజకవర్గానికి చెందిన పులపర్తి ప్రశాంత్, రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన యనమల భాస్కర్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే పనిచేస్తున్న 14 మంది సభ్యుల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారాన్ని సేకరించి అధ్యయనం చేసి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నివేదించనుంది. కమిటీ అందించే నివేదికల ఆధారంగా పవన్ కళ్యాణ్ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *