ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి

డిజిటల్ బిజినెస్ పై అవగాహన తరగతులు
నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు
ఆర్యవైశ్యుల సంక్షేమానికి, వ్యాపారాభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు అన్నారు. ఆదివారం నరసరావుపేటలో జరిగిన పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. నూతన కార్యవర్గానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్ పోటీని తట్టుకునేలా స్థానిక వ్యాపారులకు అవసరమైతే డిజిటల్ బిజినెస్‌పై ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వ్యాపారులకు ప్రభుత్వ రుణాలు, సబ్సిడీలు సులభంగా అందేలా త్వరలోనే బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మికంగా భజన మందిరాలకు TTD ద్వారా పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశాను.

