పట్టాభిపై అసభ్యకర పోస్టులు
చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పై ఉద్దేశ్యపూర్వకంగా, రెచ్చగొట్టేలా, అవమానపరిచేలా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంగళవారం టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభారామ్, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగులమీరా డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.